రానా అతిథిపాత్రలో ‘తూటా’

ధనుష్‌, మేఘా ఆకాష్‌ జంటగా గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘ఎనై నోకి పాయుమ్‌ తోట’.. తెలుగులో ‘తూటా’ పేరుతో విడుదల కానుంది..

  • Publish Date - September 25, 2019 / 10:05 AM IST

ధనుష్‌, మేఘా ఆకాష్‌ జంటగా గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘ఎనై నోకి పాయుమ్‌ తోట’.. తెలుగులో ‘తూటా’ పేరుతో విడుదల కానుంది..

ధనుష్‌, మేఘా ఆకాష్‌ జంటగా గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘ఎనై నోకి పాయుమ్‌ తోట’.. తెలుగులో ‘తూటా’ టైటిల్‌తో అనువాదమవుతోంది. విజయభేరి బ్యానర్‌‌పై జి.తాతా రెడ్డి, జి.సత్యనారాయణ రెడ్డి తెలుగులో డబ్ చేసి విడుదల చెయ్యనున్నారు.

రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో భల్లాలదేవ రానా దగ్గుబాటి అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ నటుడు, దర్శకుడు శశి కుమార్ ధనుష్ అన్నగా నటించాడు. సునైనా, సెంథిల్ వీరాస్వామి, వేల రామమూర్తి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

Read Also : హౌస్‌ఫుల్ 4 – ఫీమేల్ క్యారెక్టర్స్ ఫస్ట్‌లుక్స్..

గౌతమ్ మీనన్ మార్క్ లవ్ స్టోరీ, ధనుష్, మేఘా ఆకాష్‌‌ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని..  డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. మ్యూజిక్ : శివ, సినిమాటోగ్రఫీ : జాన్, మనోజ్ పరమహంస, కథీర్.