Rana-Ram Charan: జై రామ్ చరణ్.. ఫ్యాన్ వింత రియాక్షన్.. రానా ఏమన్నాడో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ లో చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో రామ్ చరణ్, రానా దగ్గుబాటి(Rana-Ram charan) ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Rana Daggubati has hilarious reaction to fan saying ‘Jai Ram Charan’ while clicking selfie

Rana-Ram charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ లో చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో రామ్ చరణ్, రానా దగ్గుబాటి ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా సందర్భాలలో ఈ విషయం గురించి ఓపెన్ గానే చెప్పుకున్నారు ఈ ఇద్దరు. చదువుకునే రోజుల నుంచి ఇప్పటి వరకు వాళ్ళ బాండింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరోలు అయినప్పటికి ఒక్కచోట కలిస్తే మాత్రం చిన్నపిల్లల్లా మారిపోతారు. ఇక ఈ ఇద్దరు ఏ షోకి వెళ్లినా ఒకరి గురించి ఒకరిని అడగడం జరుగుతూనే ఉంటుంది. అయితే, తాజాగా అలాంటి సంఘటనే ఒక తిరిగింది. దానికి రానా ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Vijay Antony: బిచ్చగాడు కాంబోలో మరో మూవీ.. ఈసారి ఇంకా సరికొత్తగా.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

ఇంతకీ అసలు విషయం ఏంటంటే, రానా దగ్గుబాటి ఇటీవల(Rana-Ram charan) సైమా 2025 అవార్డ్స్ కోసం దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రానా అక్కడకు వచ్చిన ఫ్యాన్స్, ఆడియన్స్ తో సెల్ఫీ దిగడానికి ప్రయతించాడు. ఆ సమయంలో ఆ గుంపులో లో నుంచి ఒక ఫ్యాన్ జై మాహిష్మతి అని గట్టిగా అరిచాడు. కాసేపటికి మరి వ్యక్తి జై రామ్ చరణ్ అంటూ గట్టిగా అరిచాడు. దానికి సమాధానంగా రానా.. బాహుబలిలో రామ్ చరణ్ లేదు కదా అన్నాడు. దానికి ఆ ఫ్యాన్ రియాక్ట్ అవుతూ. బాహుబలిలో లేడు కానీ, రామ్ చరణ్ మీ క్లోజ్ ఫ్రెండ్ కదా అన్నాడు.

దానికి బదులుగా రానా.. కాదు మా ఇంట్లో వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఒక్కమాటతో రామ్ చరణ్ అంటే రానాకు ఎంత ఇష్టమో అర్థమయ్యింది. కేవలం తనను ఒక ఫ్రెండ్ లా కాకండా ఇంట్లో మనిషిలాగా ట్రేట్ చేస్తున్నాడు రానా. ప్రస్తుతం రానాకు సంబందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రానా ప్రస్తుతం పరాశక్తి అనే తమిళ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో శవాకార్తికేయన్ హీరోగా చేస్తుండగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు బుచ్చిబాబు సనాతో పెద్ది సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మర్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.