Rana Daggubati Introduced Teja Sajja and Hanuman Movie to Bollywood in Mumbai Event
Rana Daggubati : టాలీవుడ్(Tollywood) భళ్లాలదేవా రానా అంటే అందరికి ఇష్టమే. వాళ్ళ బాబాయ్ వెంకీ మామ లాగే అందరి హీరోల ఫ్యాన్స్ కి రానా అంటే ఇష్టం. అందరు హీరోలతో క్లోజ్ గా, కామన్ గా ఉండే ఫ్రెండ్ రానా ఒక్కడే. అయితే రానాకి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్(Bollywood) లో కూడా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. రానా చాలామందికి నటుడిగానే తెలుసు. రానా నటుడికంటే ముందు VFX డిజైనర్. VFX కంపెనీ కూడా స్థాపించి దాదాపు 70 సినిమాలకు వర్క్ చేశాడు. విజువల్స్ ఎఫెక్ట్స్ లో రానా నంది అవార్డు కూడా అందుకున్నాడు.
తన కంపెనీ స్పిరిట్ మీడియాతో బాలీవుడ్ లో అనేక సినిమాలకు పని చేశాడు. తెలుగులో స్టార్ అవ్వకముందే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలతో రానాకు మంచి స్నేహం ఉంది. బాలీవుడ్ స్టార్స్ పార్టీలకు రానా కూడా వెళ్తాడు. బాలీవుడ్ సిరీస్, సినిమాలలో కూడా రానా నటిస్తున్నాడు. రానా ముంబై అకాడమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ లో బోర్డు మెంబర్ కూడా. ఆ రేంజ్ లో రానాకు బాలీవుడ్ లో పరిచయాలు, పేరు ఉన్నాయి. దీంతో తెలుగు స్టార్ సినిమాలు కాకుండా కొత్తగా హిందీలోకి అడుగు పెట్టేవాళ్ళు, తెలుగు డైరెక్టర్స్, తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ అవ్వాలనుకుంటే రానా దగ్గరుండి సపోర్ట్ చేస్తాడు. ముంబైలో తెలుగు సినిమాలు ఈవెంట్ పెడితే రానా కచ్చితంగా వచ్చి వారిని బాలీవుడ్ కి పరిచయం చేస్తాడు.
ఇటీవల నాని దసరా సినిమా బాలీవుడ్ ప్రమోషన్స్ లో రానా పాల్గొన్నాడు. ఇప్పుడు తేజ సజ్జ(Teja Sajja) హనుమాన్(Hanuman) సినిమా బాలీవుడ్ ప్రమోషన్స్ లో కూడా రానా పాల్గొన్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సూపర్ హీరో సినిమా హనుమాన్. మన ఆంజనేయస్వామి స్పూర్తితో సూపర్ హీరో కథని రాసుకొని తెరకెక్కించగా ఈ సినిమా జనవరి 12న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది. దీంతో హనుమాన్ చిత్రయూనిట్ తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ చేస్తున్నారు.
Also Read : Guntur Kaaram : రమణ గాడి ‘గుంటూరు కారం’ ట్రైలర్ రికార్డ్.. రీజనల్ సినిమాతోనే అదరగొడుతున్న బాబు..
నిన్న రాత్రి ముంబైలో హనుమాన్ ప్రమోషన్స్ చేయగా రానా ఈ ఈవెంట్ కి వచ్చి హనుమాన్ సినిమా గురించి, తేజ గురించి గొప్పగా చెప్పాడు. తేజ కూడా బాలీవుడ్ లో రానా సపోర్ట్ ఇస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. ముంబైలో ఏ టాలీవుడ్ సినిమా, ఏ కొత్త తెలుగు సినిమా ప్రమోట్ అవ్వాలన్నా రానా సపోర్ట్ చేస్తాడు అంటూ తేజ అన్నాడు. దీంతో రానా మరోసారి వైరల్ అవుతున్నారు. తెలుగు సినిమాని తనకున్న పరిచయాలతో బాలీవుడ్ లో మరింత ముందుకు తీసుకెళ్తున్నందుకు అభిమానులు, తెలుగు ప్రేక్షకులు రానాని అభినందిస్తున్నారు.
Creating a magical wave in Mumbai ❤️?
Team #HANUMAN poses with @RanaDaggubati, the @RKDStudios producers & #AnilThadani from @AAFilmsIndia after an exciting press interaction during the 'The Superhero tour' ❤️?
A @PrasanthVarma Film
?ing @tejasajja123In WW Cinemas from JAN… pic.twitter.com/sg8orZx3gV
— Primeshow Entertainment (@Primeshowtweets) January 8, 2024