Political Interviews: బాలయ్య అన్‌స్టాపబుల్‌కి.. రానా, విజయ్ దేవరకొండ పోటీగా వస్తున్నారా..?

బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోకి పోటీగా రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూ ప్రోగ్రాం చేయబోతున్నారా..?

Rana Daggubati Vijay Deverakonda political interview with KTR news viral

Rana Daggubati – Vijay Deverakonda : టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి క్రేజ్ ని పలువురు తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటుంటారు. ఈక్రమంలోనే ఈ ఇద్దరు యాడ్స్, టీవీ ఇంటర్వ్యూల్లో కనిపిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ ప్రోగ్రాం చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి బాలయ్య అన్‌స్టాపబుల్‌కి పోటీగా వస్తున్నారా..? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎలక్షన్ కాంపెయిన్ కోసం ఆయా పార్టీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే టిఆర్ఎస్ మంత్రి కేటీర్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారట. ఇక ప్రోగ్రాంని రానా, విజయ్ కలిసి హోస్ట్ చేయబోతున్నారట. వీరిద్దరూ కలిసి కేటీర్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నారని, ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

Also read : Hollywood actress Angelina Jolie : గాజా యుద్ధంపై హాలివుడ్ నటి ఏంజెలీనా జోలీ సంచలన వ్యాఖ్యలు…దూషించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్

ఈ ఇంటర్వ్యూని కొన్ని రోజుల్లో టీవీ ఛానల్స్ లో ప్రసారం చేయనున్నారట. కాగా అన్‌స్టాపబుల్‌ షోలో బాలయ్య రాజకీయ నాయకులతో చేసిన ఇంటర్వ్యూలు.. పొలిటికల్ నేపథ్యంలో చాలా హైలైట్ గా నిలిచాయి. ఆ ఇంటర్వ్యూలకు ఓ రేంజ్ రేటింగ్ వ్యూస్ కూడా వచ్చాయి. మరి రానా, విజయ్ కలిసి చేసే ఈ పొలిటికల్ ఇంటర్వ్యూ ఆ రేంజ్ వ్యూస్ ని అందుకుంటుందో లేదో చూడాలి.