Rana Wife : కర్వాచౌత్ పండుగ.. రానా భార్య మిహీక స్పెషల్ పోస్ట్.. అదే చంద్రుడి కింద అంటూ..
మిహీక నార్త్ ఇండియన్ అమ్మాయి కావడంతో తాజాగా కర్వాచౌత్ పండుగను సెలబ్రేట్ చేసుకొని సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది.

Rana Daggubati Wife Miheeka Celebrates Karva Chauth shares a Post
Rana Daggubati Wife Miheeka : రానా దగ్గుబాటి 2020లో కరోనా సమయంలో తను ప్రేమించిన అమ్మాయి మిహికా బజాజ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మిహీక నార్త్ ఇండియన్ అమ్మాయి కావడంతో తాజాగా కర్వాచౌత్ పండుగను సెలబ్రేట్ చేసుకొని సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది.
భర్త కోసం భార్య చేసుకునే పండుగ కర్వా చౌత్. ఈ పండుగను నార్త్ లో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కర్వా చౌత్ రోజు పెళ్ళైన మహిళలు గోరింటాకు పెట్టుకొని, సాంప్రదాయంగా రెడీ అయి శివుడిని, చంద్రుడిని పూజిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం అయ్యాక జల్లెడలో చంద్రుడ్ని చూసి ఆ తర్వాత తన భర్త మొహాన్ని చూస్తారు. తన భర్త బాగుండాలని ఈ ఉపవాసం, పూజలు చేస్తారు. ఇక జల్లెడలో ముఖం చూసాక భర్త భార్యకు ఆహరం ఇచ్చి ఉపవాస దీక్షని విరమించేలా చేస్తారు. చాలా మంది నార్త్ సెలబ్రిటీలు ఈ కర్వాచౌత్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.
Also Read : Rakul Preet Singh : పెళ్లయ్యాక భర్తతో రకుల్ ప్రీత్ సింగ్ మొదటి కర్వా చౌత్ వేడుకలు.. ఫొటోలు వైరల్..
నిన్న అక్టోబర్ 20న కర్వాచౌత్ పండగ కావడంతో ఇప్పటికే చాలా మంది నార్త్ హీరోయిన్స్ పలు ఫొటోలు షేర్ చేసారు. రానా భార్య మిహీక కూడా నార్త్ అమ్మాయి కావడంతో సంప్రదాయంగా ఈ కర్వాచౌత్ ని సెలబ్రేట్ చేసుకుంది. సాంప్రదాయంగా చీర కట్టుకొని రెడీ ఆయన ఫోటోని షేర్ చేసి.. అదే చంద్రుడు కింద ప్రతి సంవత్సరం ప్రేమ ఇంకా బలపడుతుంది అంటూ రానా దగ్గుబాటిని ట్యాగ్ చేసి హ్యాపీ కర్వాచౌత్ అని చెప్పింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే కేవలం మిహీక ఒక్కతే ఉన్న ఫోటో షేర్ చేసింది. ఫ్యాన్స్, నెటిజన్స్ రానాతో ఉన్న ఫోటో షేర్ చేస్తే బాగుండు కదా అని అడుగుతున్నారు.