Rana
Rana Nayudu : దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కాంబినేషన్ లో మల్టీస్టారర్ రాబోతుంది. రానా హీరోగా చేసిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో వెంకటేష్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు బాబాయి, అబ్బాయి కలిసి వెబ్ సిరీస్ ని చేయబోతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు వస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ సిరీస్ ని తెరకెక్కించబోతున్నారు. ఈ సిరీస్ కి ‘రానా నాయుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇటీవల ఈ సిరీస్ కి సంబంధించి ఫోటోషూట్ కూడా జరిగింది. ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటో కూడా విడుదల చేశారు.
Balakrishna : బాలకృష్ణతో మోహన్ బాబు, విష్ణు చర్చలు.. ‘మా’ కోసమేనా??
అమెరికన్ హిట్ సిరీస్ ‘రే డోనోవ్యాన్’ను ఆధారంగా ఈ కథని తీసుకున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. బాలీవుడ్ వెబ్ సిరీస్ లు మీర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పని చేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వెంకీ ‘ఎఫ్ 3’లో నటిస్తున్నాడు. ‘దృశ్యం2’ విడుదలకి సిద్ధంగా ఉంది. రానా ‘విరాట పర్వం’, ‘భీమ్లా నాయుక్’లో నటిస్తున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు ఇద్దరూ కలిసి మొదటి సారి మల్టీస్టారర్ చేస్తుండటంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ లో ఫీమేల్ లీడ్ రోల్స్ లో ఎవర్ని తీసుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.