Rana Daggubati : నాగచైతన్య పెళ్లిలో రానా దగ్గుబాటి సందడి.. స్పెషల్ ఫోటో షేర్ చేసిన రానా..

చైతు పెళ్ళిలో రానా హడావిడే ఎక్కువ ఉంది. తాజాగా దానికి సంబందించిన ఒక స్పెషల్ ఫోటో షేర్ చేసాడు రానా.

Rana shared a special photo At Naga Chaitanya wedding

Rana Daggubati : అక్కినేని నాగచైతన్య, శోభిత తాజాగా పెళ్లి బంధంతో ఒక్కట్టయ్యారు. కొంత కాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. బుధవారం రాత్రి 8.13 గంటలకి శోభిత ధూళిపాళ్ల మెడలో నాగచైతన్య తాళి కట్టాడు. ప్రస్తుతం వీరి వివాహ వేడుకకి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read : Naga Chaitanya-Sobhita : ‘మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నాగచైతన్య, శోభిత’.. పెళ్లి వీడియో చూసారా..

అయితే వీరి వివాహ వేడుకకి అక్కినేని, ధూళిపాళ్ల, దగ్గుబాటి ఫ్యామిలీస్‌తో పాటు పరిమిత సంఖ్యలో సన్నిహితులు, అతిథులు మాత్రమే వచ్చారు. ఇక వారిలో రానా స్పెషల్ గా నిలిచాడు. ముందు నుండే నాగచైతన్య, రానాల మధ్య మంచి అనుభందం ఉంది. వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ . దాంతో చైతు పెళ్ళిలో రానా హడావిడే ఎక్కువ ఉంది. తాజాగా దానికి సంబందించిన ఒక స్పెషల్ ఫోటో షేర్ చేసాడు రానా.


నాగచైతన్య పెళ్ళిలో తనతో దిగిన ఒక ఫోటో షేర్ చేసి ‘పెళ్లికొడు’ అని దానికి ఒక క్యాప్షన్ కూడా జోడించాడు. దీంతో రానా షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు ఇప్పటికే వీరి మంగళ స్నానాలు, హల్దీ ఫొటోలు, వీడియోలు షేర్ చెయ్యగా అవి కూడా ఎంతో వైరల్ అవుతున్నాయి.