Raha Kapoor : రెండేళ్లకే 250 కోట్ల ఆస్తి.. కూతురి పేరు మీద రాసేసిన రణబీర్ – అలియా..

ఈ రెండేళ్ల బుజ్జి పాపాయి ఇప్పుడు 250 కోట్ల ఆస్తిపరురాలు.

Ranbir Kapoor and Alia Bhatt Registered 250 Crores Property on the name of her Daughter Raha Kapoor

Raha Kapoor : బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ – అలియా భట్ లకు 2022 నవంబర్ లో రాహా కపూర్ జన్మించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు రణబీర్ అలియా బయటకు తీసుకురావడంతో మీడియా కంట పడి రాహా అలరిస్తుంది. తాజాగా రాహా కపూర్ పేరు వార్తల్లో నిలుస్తుంది. ఈ రెండేళ్ల బుజ్జి పాపాయి ఇప్పుడు 250 కోట్ల ఆస్తిపరురాలు.

ముంబైలోని బాగా ఖరీదైన ఏరియా బాంద్రాలో రణబీర్ కపూర్ కి వారసత్వంగా ఓ ఖరీదైన ఇల్లు వచ్చింది. రాజ్ కపూర్ నుంచి రిషి కపూర్ ఆ తర్వాత రణబీర్ కపూర్ కి ఆ ఇల్లు వారసత్వంగా సంక్రమించింది. గత సంవత్సరం రణబీర్ కపూర్ చేతికి ఆ ఇల్లు రాగా ఆ ఇంటిని రీ మోడలింగ్ చేయించాడు. 6 అంతస్థుల లగ్జరీ బిల్డింగ్ అది. రీ మోడలింగ్ తర్వాత దాని ప్రస్తుత విలువ 250 కోట్లు అని సమాచారం.

Also Read : Avika Gor : ఆరేళ్ళ ప్రేమ.. బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..

అయితే రణబీర్ – అలియా జంట ఆ ఇంటిని రాహా కపూర్ పేరు మీద ఇటీవల రిజిస్టర్ చేయించారని సమాచారం. త్వరలో ఈ జంట తమ కూతురుతో కలిసి ఆ ఇంటికే షిఫ్ట్ అయిపోతారని కూడా వినిపిస్తుంది. ఆ ఇల్లు రణబీర్ కుటుంబ వారసత్వానికి గుర్తు. అలాంటి ఖరీదైన ఇంటిని తన కూతురి పేరు మీద అప్పుడే రిజిస్టర్ చేయించడంతో అంతా షాక్ అవుతున్నారు. దీంతో రెండేళ్ల రాహా 250 కోట్లకు వారసురాలు అనే వార్త వైరల్ గా మారింది.