Animal : యానిమల్ వచ్చేస్తుంది.. షూటింగ్ ఫినిష్ చేసిన రణబీర్..

గ్యాంగ్‌స్టర్ కథాంశంతో యానిమల్ సినిమా మోస్ట్ వైలెంట్ గా రానుంది. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, బాబీ డియోల్ ముఖ్య పాత్రలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.

Ranbir kapoor Animal Film Shoot Completed

Animal :  అర్జున్ రెడ్డి(Arjun Reddy) డైరెక్టర్ సందీప్ వంగ(Sandeep Vanga) తెలుగులో ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయి బాలీవుడ్(Bollywood) కి వెళ్ళిపోయాడు. ఇదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్(Kabir Singh) పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. దీంతో వరుసగా స్టార్ హీరోల సినిమాలు పట్టేశాడు సందీప్. ప్రస్తుతం సందీప్ వంగ రణబీర్ కపూర్(Ranbir kapoor) తో యానిమల్ సినిమా చేస్తున్నాడు.

గ్యాంగ్‌స్టర్ కథాంశంతో యానిమల్ సినిమా మోస్ట్ వైలెంట్ గా రానుంది. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, బాబీ డియోల్ ముఖ్య పాత్రలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. యానిమల్ సినిమాని 11 ఆగస్టు 2024 పాన్ ఇండియా రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా కేవలం టైటిల్, రణబీర్ ఫస్ట్ లుక్, షూటింగ్ నుంచి లీక్ అయిన రణబీర్ పిక్స్ తోనే సినిమాపై భారీ హైప్ నెలకొంది.

Takkar Teaser : దివ్యాంశ కౌశిక్‌‌తో సిద్దార్థ్ రొమాన్స్ మాములుగా లేదుగా..

తాజాగా యానిమల్ షూటింగ్ లండన్ లో పూర్తి అయింది. లండన్ లో ఫైనల్ షెడ్యూల్ పూర్తవ్వడంతో షూటింగ్ సెట్ లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో హీరో రణబీర్, బాబీ డియోల్, డైరెక్టర్ సందీప్ వంగ పాల్గొన్నారు. యానిమల్ షూటింగ్ అయిపోయిందని తెలియడంతో రణబీర్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరగా సినిమా అప్డేట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.