Ranbir Kapoor : గుట్టు చప్పుడుగా ‘రామాయణ’ షూటింగ్ మొత్తం కంప్లీట్.. రణబీర్ ఏమన్నాడంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యానిమల్ సినిమా తర్వాత చేస్తున్న ఎంతో ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణ.

Ranbir Kapoor confirms completion of Ramayana Part 1
Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యానిమల్ సినిమా తర్వాత చేస్తున్న ఎంతో ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణ. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు. కాగా దీనిని భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ పలు బాలీవుడ్ నిర్మాతలతో కలిసి తెరకెక్కిస్తున్నారు.
అయితే తాజాగా ఆయన చేస్తున్న రామాయణ షూటింగ్ ఎంతవరకు వచ్చిందో క్లారిటీ ఇచ్చాడు రణబీర్ కపూర్. ఇక ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. “రామాయణంలో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. దీనికి నితేష్ తివారీ దర్శకత్వం వహించారు. రామాయణ రెండు భాగాలుగా వస్తుంది. పార్ట్ 1 షూటింగ్ పూర్తయ్యింది. త్వరలో పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తాము. ఈ కథలో భాగం కావడం నా కల. రామ్ పాత్రలో నటించినందుకు చాలా హ్యాపీ గా ఉంది. అన్నీ ఉన్న సినిమా ఇది. భారతీయ సంస్కృతి అంటే ఏమిటో ఇందులో ఉంటుంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నానని తెలిపారు.”
Since last 1 Year, for the First time he spoke about #Ramayana 😂👍🏻#RanbirKapoor pic.twitter.com/GGiVxpQgyf
— Radhe 🪓 RanVijay (@Being_Bhai_) December 8, 2024
దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే తెలిపారు మేకర్స్. దీపావళి కానుకగా 2026లో ఈ సినిమా వస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అలానే దీని షూటింగ్ ఎప్పటి నుండో జరుగుతున్నా బయటికి మాత్రం తెలియనివ్వలేదు మేకర్స్. గుట్టు చప్పుడుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్ కి రెడీ చేశారు.