Ram Gopal Varma : సంధ్య థియేటర్ ఘటనపై ఆర్జీవీ షాకింగ్ పోస్ట్.. దానికి కారణం అల్లు అర్జున్ ఎలా అవుతారని ఫైర్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు.

Ram Gopal Varma : సంధ్య థియేటర్ ఘటనపై ఆర్జీవీ షాకింగ్ పోస్ట్.. దానికి కారణం అల్లు అర్జున్ ఎలా అవుతారని ఫైర్..

RGV shocking post on Sandhya Theater incident

Updated On : December 9, 2024 / 4:25 PM IST

Ram Gopal Varma : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో వెయ్యడంతో సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ తన భార్య, పిల్లలతో కలిసి వెళ్ళాడు. బెనిఫిట్ షో కావడంతో అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి పెద్ద ఎత్తున బన్నీ ని చూడడానికి ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఎక్కడెక్కడి నుండో జనాలు రావడంతో థియేటర్ వద్ద గందర గోళం ఏర్పడింది.

Also Read : Animal 3 : ‘మరింత అరాచకంగా యానిమల్ 3’.. క్లారిటీ ఇచ్చిన హీరో..

ఆ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అల్లు అర్జున్ ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు అందజేస్తానని తెలిపారు. అయితే తాజాగా ఈ ఘటనపై ప్రముఖ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.”ఈ ఘటనకు అల్లు అర్జున్ ను నిందించడం కరెక్ట్ కాదు. బెనిఫిట్ షోలకు స్టార్లను రావొద్దనడం, బెనిఫిట్ షోలను రద్దు చేయడం.. కరెక్ట్ కాదని అన్నారు. భారీ సంఖ్యలో జనం వచ్చిన సందర్భాల్లో తొక్కిసలాటలు జరగడం కామన్ అని అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట మొదటిసారేమి కాదు అన్నారు. గడిచిన ఈ దశాబ్దంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు, అందులో వేల సంఖ్యలో చనిపోయిన జనం ఉన్నారని తెలిపారు.


తొక్కిసలాట వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా నిర్లక్ష్యం వల్ల జరిగిందా, అసమర్థత వల్ల లేదా ఉద్దేశ్యంతో జరిగిందా అనేది ఒక కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తేనే తెలుస్తుంది. గతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడో, మరేదైనా జరిగితే విరాళాలు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా షోలు వేసి వచ్చిన డబ్బును విరాళంగా ఇచ్చేవారని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ షో కి వచ్చిన బన్నీ ఈ ఘటనకి కారణం ఎలా అవుతాడని అన్నారు. బెనిఫిట్ షోలు వెయ్యడానికి ముఖ్య కారణం ఆ సినిమాపై ఉన్న హైప్ అలానే క్రేజ్ అని అన్నారు. ఈ బెనిఫిట్ షోలతో ఇతరులకు ఎలాంటి లాభం ఉండదు. కానీ వీటిని బెనిఫిట్ షోలు అనడం కంటే స్పెషల్ షోస్ అనడం కరెక్ట్ అని అన్నారు. దీని పై ఓ మంచి నిర్ణయం ఆలోచించి తీసుకుంటారని కోరుకుంటున్నా.. అని తెలిపారు. ” దీంతో ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.