Animal 3 : ‘మరింత అరాచకంగా యానిమల్ 3’.. క్లారిటీ ఇచ్చిన హీరో..

తాజాగా యానిమల్ 3 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు రణబీర్ కపూర్.

Animal 3 : ‘మరింత అరాచకంగా యానిమల్ 3’.. క్లారిటీ ఇచ్చిన హీరో..

Ranbir Kapoor has given clarity that there will be Animal 3 as well

Updated On : December 9, 2024 / 3:28 PM IST

Animal 3 : గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన యానిమల్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దాదాపుగా 900 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాను అంత త్వరగా ఎవ్వరూ మరిచిపోలేరు. అందులో చూపించిన తండ్రి కొడుకుల ప్రేమ అలాంటిది మరి.

Also Read : Shah Rukh Khan-Aryan Khan : తండ్రీ కొడుకుల విస్కీ బిజినెస్.. వరల్డ్ లోనే బెస్ట్ బ్రాండ్ గా.. రేటెంతో తెలుసా..

అయితే తాజాగా యానిమల్ 3 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు రణబీర్ కపూర్. యానిమల్ సినిమా పార్ట్ 2నే కాదు 3 కూడా ఉండబోతుందని షాక్ ఇచ్చాడు. యానిమల్ కింగ్ డం పేరుతో పార్ట్ 3 రానుందని తెలిపారు. యానిమల్ క్లైమాక్స్ ఎపిసోడ్ లో త్వరలోనే సీక్వెల్ కూడా ఉంటుందని చూపించి యానిమల్ పార్క్ అనే టైటిల్ కూడా ప్రకటించారు. పార్ట్ 2 ఉందని తెలిపినప్పటికీ అది 2027లో స్టార్ అవుతుందన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు 2027లో స్టార్ అయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. ఎందుకంటే..యానిమల్ తర్వాత ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చెయ్యనున్నారు. ఈ సినిమాలు పూర్తయ్యాక యానిమల్ వైపు వెళ్తాడు..


అలాగే రణబీర్ కపూర్ కూడా యానిమల్ సినిమా తర్వాత రామాయణ 1, 2, బ్రహ్మస్త్ర 2, లవ్ అండ్ వార్ తో పాటు ధూమ్ 4కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలు పూర్తయ్యాక యానిమల్ చేస్తాడట. అలా డైరెక్టర్ హీరో ఇద్దరూ బిజీగా ఉండడంతో యానిమల్ 2 స్టార్ట్ అవ్వడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుందట.