Ranbir Kapoor : నా వల్ల కాదు.. మళ్ళీ బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ చేయను.. మీ వల్ల అలియా గొంతు కూడా పోయింది..

రణబీర్ కపూర్ కి చిత్ర యూనిట్ వాళ్ళు కాల్ చేసి బ్రహ్మాస్త్ర ఓటీటీలోకి వస్తుంది కదా ప్రమోషన్స్ చేయాలి అనడంతో రణబీర్ సీరియస్ అవుతూ.........

Ranbir Kapoor : నా వల్ల కాదు.. మళ్ళీ బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ చేయను.. మీ వల్ల అలియా గొంతు కూడా పోయింది..

Ranbir Kapoor fires on movie team regarding Brahmastra promotions

Updated On : October 27, 2022 / 8:03 AM IST

Ranbir Kapoor :  రణబీర్ కపూర్, అలియా జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ లో రిలీజయి మంచి విజయమే సాధించింది. దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా నష్టాల్లో ఉన్న బాలీవుడ్ కి ఊపిరిపోసింది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసి వీర లెవల్లో ప్రమోషన్స్ చేశారు. టాలీవుడ్ లో అయితే రాజమౌళి, నాగార్జున, ఎన్టీఆర్, చిరంజీవిలని కూడా వాడుకొని ప్రమోషన్స్ చేశారు.

భారీ విజయం కాకపోయినా మంచి విజయమే సాధించింది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా హాట్ స్టార్ ఓటీటీలోకి రానుంది. నవంబర్ 4 నుంచి బ్రహ్మాస్త్ర హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవ్వనుంది. దీంతో మళ్ళీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా అలియా ఓ ఆసక్తికర వీడియోని షేర్ చేసింది.

ఈ వీడియోలో రణబీర్ కపూర్ కి చిత్ర యూనిట్ వాళ్ళు కాల్ చేసి బ్రహ్మాస్త్ర ఓటీటీలోకి వస్తుంది కదా ప్రమోషన్స్ చేయాలి అనడంతో రణబీర్ సీరియస్ అవుతూ.. ”బ్రహ్మాస్త్ర రిలీజ్ అయిపొయింది, ప్రమోషన్స్ భారీగా చేశాం. ఇంక నా వల్ల కాదు మళ్ళీ ప్రమోషన్స్ అంటే. సినిమాలో అలియా కూడా ఇన్ని సార్లు శివ శివ అని అరవలేదేమో. మీ ప్రమోషన్స్ లో అలియా పాటలు పాడి పాడి గొంతు కూడా పోయింది. ఇంకా ఏం ప్రమోట్ చేయాలి. ఇంటింటికి వెళ్లి బ్రహ్మాస్త్ర ఓటీటీలో వస్తుంది చూడండి అని చెప్పాలా? నాకు బ్రహ్మాస్త్ర తప్ప వేరే లైఫ్ లేదా ఇంక” అని మాట్లాడాడు.

Puri Jagannadh : లైగర్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ పై పూరి జగన్నాధ్ పోలీస్ కేసు.. మరింత ముదురుతున్న వివాదం..

ఆ వెంటనే డైరెక్టర్ అయాన్ కాల్ చేసి బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ చేయమనడంతో ఓకే చేద్దాం అన్నాడు. ఈ వీడియోని షేర్ చేసి మా పరిస్థితి ఇలాగే ఉంది ప్రస్తుతం అని అలియా పోస్ట్ చేయడం విశేషం.