Ranbir Kapoor Sandeep Vanga Animal Movie Teaser Release
ANIMAL Teaser : ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమాతో ఫేమ్ ని సంపాదించుకున్న టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ (Sandeep Vanga).. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తో తెరకెక్కిస్తున్న సినిమా ‘యానిమల్’. ఈ మూవీ పై ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. గతంలో ఈ మూవీ నుంచి ఒక చిన్న ప్రీ టీజర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. తాజాగా నేడు రణబీర్ పుట్టినరోజు సందర్భంగా ఫుల్ టీజర్ ని రిలీజ్ చేశారు.
Sankranti 2024 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన రవితేజ.. ఈసారి సంక్రాంతికి అరడజనకు పైగా..
టీజర్ చూస్తుంటే ఈ మూవీని ఫాదర్ అండ్ సన్ బాండింగ్ పై దర్శకుడు తెరకెక్కించాడని అర్ధమవుతుంది. అనిల్ కపూర్ రణబీర్ కి తండ్రిగా కనిపించబోతున్నాడు. ఇక టీజర్ లో ఒక మోస్తరు యాక్షన్ చూపించి సినిమాలో వియోలెన్స్ ఎలా ఉండబోతుందో ఒక చిన్న హింట్ ఇచ్చాడు. అయితే ఈ టీజర్ లో హీరో క్యారెక్టర్ ని కొంచెం సస్పెన్స్ గానే పెట్టాడు దర్శకుడు. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకునేలానే ఉంది. మరి ఆ టీజర్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తుంది. బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్.. మరింతమంది బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూవీ ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.