Rani Mukerji : నాకు 80 ఏళ్ళు వచ్చినా షారుఖ్ తో రొమాన్స్ చేయడానికి రెడీ..

ఇటీవలే రాణి ముఖర్జీ మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే అనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాని అభినందిస్తూ షారుఖ్ ట్వీట్ కూడా చేశాడు.

Rani Mukerji and Shahrukh Khan

Rani Mukerji : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan), ఒకప్పటి స్టార్ హీరోయిన్(Heroine) రాణి ముఖర్జీ(Rani Mukerji) కలిసి గతంలో చాలానే సినిమాలు తీశారు. వీరిద్దరి కాంబినేషన్ లో కుచ్ కుచ్ హోతా హై, చల్తే చల్తే, పహేలీ, కభీ అల్విదా నా కెహ్నా.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఇద్దరూ కూడా సినిమాలు చేస్తున్నారు. షారుఖ్ ఇంకా హీరోగా సినిమాలు చేస్తున్నా, రాణి ముఖర్జీ మాత్రం లేడీ ఓరియెంటెడ్, స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తుంది.

షారుఖ్, రాణి ముఖర్జీ మధ్య మంచి స్నేహం ఉంది. ఇటీవలే రాణి ముఖర్జీ మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే అనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాని అభినందిస్తూ షారుఖ్ ట్వీట్ కూడా చేశాడు. తాజాగా ఈ సినిమా సక్సెస్ ప్రమోషన్స్ లో రాణి ముఖర్జీ షారుఖ్ గురించి మీడియా వాళ్ళు అడగడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Salman Khan : బాలీవుడ్ యువ హీరోలపై సల్మాన్ సీరియస్ కామెంట్స్..

రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. నేను రైటర్స్ కి ఇప్పుడే చెప్తున్నాను, మంచి లవ్ స్టోరీ, ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ నాకు, షారుఖ్ కి రాయండి. మేమిద్దరం కలిసి చేస్తాం. షారుఖ్ తో యంగ్ లో ఉన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా, నాకు 80 ఏళ్ళు వచ్చినా కూడా రొమాన్స్ చేయడానికి, లవ్ స్టోరీలు చేయడానికి నేను రెడీనే అని తెలిపింది. దీంతో షారుఖ్, రాణి ముఖర్జీ అభిమానులు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ఆశిస్తున్నారు.