×
Ad

Ranveer Singh: ఒకప్పుడు దక్షిణాది అంటే చిన్నచూపు, కానీ ఇప్పుడు.. ఆకట్టుకుంటున్న రణ్‌వీర్ సింగ్ ట్వీట్స్!

2007 సినీ'మా' అవార్డ్స్ ఫంక్షన్ లో నార్త్ వాళ్ళకి దక్షిణాది సినెమాలన్నా, తరాలన్న చిన్న చూపు.. అంటూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సభావేదిక సాక్షిగా తన బాధని వెల్లడించారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇదంతా ఇలా ఉండగా ఇటీవల జరిగిన ‘SIIMA 2022’ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు హాజరైన బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ దక్షిణాది తారలతో కలిసి ఆడిపాడారు.

  • Published On : September 12, 2022 / 10:01 PM IST

Ranveer Singh Heartfelt Words on South Actors

Ranveer Singh: 2007 సినీ’మా’ అవార్డ్స్ ఫంక్షన్ లో నార్త్ వాళ్ళకి దక్షిణాది సినెమాలన్నా, తరాలన్న చిన్న చూపు.. అంటూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సభావేదిక సాక్షిగా తన బాధని వెల్లడించారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. నాడు ఏ దక్షిణాది సినిమాలను, తారలను చులకనగా చూసారో, నేడు అదే దక్షిణాదికి సినిమాలకు నీరాజనాలు పడుతున్నారు, అదే తారలను పొగడతల్లో ముంచుతున్నారు.

SIIMA Awards 2022: SIIMA వేడుకలో రెడ్ కార్పెట్ పై తళుక్కుమన్న తారలు..

ఇందుకు కారణం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి.. ఈ సినిమాతో ఒక్క టాలీవుడ్ నే కాదు మొత్తం దక్షిణాది సినీరంగాన్ని తల ఎగరేసేలా చేశాడు. ఇదంతా ఇలా ఉండగా ఇటీవల జరిగిన ‘SIIMA 2022’ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు హాజరైన బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ దక్షిణాది తారలతో కలిసి ఆడిపాడారు.

ఇక వారితో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ.. కమల్‌ను “ది ఐకాన్‌”, యశ్‌ ను “భాయ్‌”, అల్లు అర్జున్‌కి “హార్ట్ సింబల్”, విజయ్‌ ని “రౌడీ బాయ్స్‌”, రానాతో “గుడ్‌టైమ్స్‌” అంటూ పోస్ట్ చేయడంతో, దక్షిణాది నటులపై రణ్‌వీర్‌ చూపిస్తున్న ప్రేమకి దక్షిణాది సినీ ప్రేక్షకులు రణ్‌వీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ‘మోస్ట్‌ పాపులర్‌ హిందీ యాక్టర్‌ ఇన్‌ సౌత్‌ ఇండియా’కు గాను రణ్‌వీర్‌ సింగ్‌ అవార్డు అందుకున్నారు.