SIIMA Awards 2022: SIIMA లో “పుష్ప”కు అవార్డుల పంట..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే `సైమా`(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషన్‌ మూవీ అవార్డ్స్) అవార్డుల పురస్కారం బెంగళూరు వేదికగా ఈ శని-ఆదివారాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దక్షణాది తారలతో పాటు ఉత్తరాది తారలు కూడా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అవార్డుల పురస్కారం అందుకున్న పలువురు తారలు సోషల్ మీడియా వేదికగా వారి ఆనందాన్ని వెల్లడిస్తున్నారు.

SIIMA Awards 2022: SIIMA లో “పుష్ప”కు అవార్డుల పంట..

Pushpa winning SIIMA Awards

SIIMA Awards 2022: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే `సైమా`(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషన్‌ మూవీ అవార్డ్స్) అవార్డుల పురస్కారం బెంగళూరు వేదికగా ఈ శని-ఆదివారాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దక్షణాది తారలతో పాటు ఉత్తరాది తారలు కూడా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అవార్డుల పురస్కారం అందుకున్న పలువురు తారలు సోషల్ మీడియా వేదికగా వారి ఆనందాన్ని వెల్లడిస్తున్నారు.

Rebel Star: కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు.. విషాదంలో టాలీవుడ్!

SIIMA తమ ట్విట్టర్ వేదికగా అవార్డుల అందుకున్న వారి లిస్ట్ ప్రకటిస్తుంది..ఇందులో ఉత్తమ చిత్రం నామినేషన్ లో పుష్ప, అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలు నిలవగా.. పుష్ప ఉత్తమ చిత్రం అవార్డుని అందుకుంది. బెస్ట్ లీడింగ్ రోల్ నామినేషన్ లో అల్లు అర్జున్, బాలకృష్ణ, అల్లరి నరేష్, నాని, నాగ చైతన్య, నవీన్ పోలిశెట్టి పోటీలో నిలవగా.. బెస్ట్ లీడింగ్ రోల్ కు అల్లు అర్జున్, బెస్ట్ లీడింగ్ రోల్(క్రిటిక్స్) కు నవీన్ పోలిశెట్టి అవార్డులు అందుకున్నారు.

అలాగే ‘మోస్ట్ ఎలిజబుల్ బాచిలర్’ మూవీకు గాను బెస్ట్ ఫిమేల్ లీడ్ యాక్టర్స్ గా పూజ హెగ్దే అందుకుంది. ఇక ‘పుష్ప’కు అయితే అవార్డుల పంట పండింది.. బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీ ప్రసాద్, బెస్ట్ సపోర్టింగ్ రోల్ పుష్పలో కేశవ రోల్ చేసిన జగదీష్ అందుకున్నారు. గతంలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాకు కూడా అవార్డుల పంట పడిన విషయం తెలిసిందే.