Ranveer Singh: బాలీవుడ్లో క్రాక్ చూపిస్తానంటోన్న సర్కస్ హీరో..?
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం ‘సర్కస్’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించగా, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటించారు. అయితే సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో, ఈ సినిమాకు తొలిరోజునే దారుణమైన రెస్పాన్స్ దక్కింది.
Ranveer Singh: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం ‘సర్కస్’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించగా, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటించారు. అయితే సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో, ఈ సినిమాకు తొలిరోజునే దారుణమైన రెస్పాన్స్ దక్కింది.
Ranveer Singh : అసలు ట్రోఫీ తన దగ్గరే ఉందంటున్న రణ్వీర్..
ఇక ఈ సినిమా రిజల్ట్‌తో రణ్వీర్ సింగ్ తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెంచాడు. ఈ క్రమంలోనే ఆయన టాలీవుడ్లో సూపర్ సక్సెస్ అయిన ఓ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. గతంలోనూ జూ.ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించి సాలిడ్ హిట్ అందుకున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు మాస్ రాజా రవితేజ నటించిన ‘క్రాక్’ మూవీని హిందీలో రీమేక్ చేసేందుకు రణ్వీర్ సింగ్ రెడీ అవుతున్నాడు. క్రాక్ సినిమాతో రవితేజ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు రణ్వీర్ సింగ్ కూడా ఇదే తరహాలో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
Ranveer Singh: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రణ్వీర్ సింగ్‌కి అరుదైన గౌరవం..
అయితే ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని హిందీలోనూ ఈ సినిమాను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తాయనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు.