Site icon 10TV Telugu

Kanchana 4 : ఆ సినిమాలో దయ్యాలుగా రశ్మిక, పూజ హెగ్డే..

Rashmika and Pooja Hegde play the ghosts in Kanchana 4

Rashmika and Pooja Hegde play the ghosts in Kanchana 4

Kanchana 4 : కామెడీ హారర్ మూవీస్‌లో కాంచన సిరీస్‌కు స్పెషల్ ప్లేస్‌ ఉంటుంది. ఇప్పుడు కాంచన 4 (Kanchana 4)సెట్స్ మీద ఉండగా.. దీనికి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్టులో టాలీవుడ్‌ను ఊపేస్తున్న ఇద్దరు ముద్దుగుమ్మలు.. దెయ్యం పాత్రలో కనిపించబోతున్నారట. పూజా హెగ్డేతో పాటు నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా కలిసి నటిస్తున్నారని టాక్‌.

రాఘవ లారెన్స్ తాను హీరోగా నటిస్తూనే.. స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఇప్పటికే పూజా హెగ్డే, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రత్యేకమైన రోల్ కోసం నేషనల్ క్రష్‌ను రంగంలోకి దించాలని రాఘవ లారెన్స్ భావిస్తున్నారట. ఇప్పటికే దీనిపై సంప్రదింపులు పూర్తైనట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే అటు దక్షిణాదితో పాటు ఇటు ఉత్తరాదిలోనూ అంచనాలు మరింత రెట్టింపు కానున్నాయ్‌.

OG : ప‌వ‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్.. అదిరిపోయిన ఓజీ గ్లింప్స్.. విల‌న్‌తో ఓజీకి బ‌ర్త్‌డే విషెస్‌..

పూజా హెగ్డే గతంలో లారెన్స్ సినిమాల్లో గ్లామరస్ రోల్స్‌లో కనిపించింది. ఈసారి ఆమె హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన పవర్‌ఫుల్ దయ్యం పాత్రలో భయపెట్టబోతోంది. అటు రష్మిక, థామా సినిమాతో హారర్ జానర్‌లో సత్తా చాటింది. ఈ చిత్రంలోనూ రష్మిక దెయ్యం పాత్రలోనే కనిపించబోతోందని టాక్‌. ఈ ఇద్దరి కెమిస్ట్రీ, లారెన్స్ డైరెక్షన్‌లో ఎలా వర్కౌట్ అవుతందన్నది సినిమా ప్రేమికుల్లో ఆసక్తి రేపుతోంది.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తుండగా, సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ అయి, వచ్చే సమ్మర్‌లో రిలీజ్ కానుందని సమాచారం. పూజా, రష్మిక ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే, కాంచన సిరీస్‌లో గతంలో చూసిన రాయ్ లక్ష్మీ, తాప్సీ లాంటి హీరోయిన్ల గ్లామర్, హారర్ మిక్స్‌ను మరో స్థాయిలో చూసే అవకాశం ఉంది. కాంచన 4 పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయ్.

Exit mobile version