Vijay Devarakonda- Rashmika : విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్.. ఈ సారి పక్కా క్లారిటీ ఇచ్చిన రష్మిక..

రష్మిక పుట్టిన రోజు నాడు తనకు వచ్చిన విషెష్ కి అభిమానులకు, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే విజయ్ దేవరకొండ పాత ఫోటో ఒకటి షేర్ చేసి, దాంట్లో ఉన్న ప్లేస్, రష్మిక ఇప్పుడు వీడియో పోస్ట్ చేసిన ప్లేస్ రెండూ ఒకటే.

Rashmika gives clarity about relation with Vijay Devarakonda

Vijay Devarakonda- Rashmika :  నేషనల్ క్రష్ రష్మిక(Rashmika), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కలిసి రెండు సినిమాల్లో నటించారు. గీతా గోవిందం(Geetha Govindam) సినిమా సూపర్ హిట్ అవ్వగా, డియర్ కామ్రేడ్(Dear Comrade) సినిమా ఫ్లాప్ అయింది. అయితే వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కొన్ని రోజుల క్రితం ఇద్దరు కలిసి ముంబైలో(Mumbai) చెట్టాపట్టాలేసుకొని తిరగడం, మాల్దీవ్స్(Maldives) కి కలిసి వెళ్లడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు, ప్రేమలో ఉన్నారు అనే వార్తలు బాగా వచ్చాయి.

దీనిపై అధికారికంగా ఇద్దరూ స్పందించలేదు. కానీ మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఇండైరెక్ట్ గా రష్మిక మాత్రం మా ఇద్దరి మధ్య ఏం లేదు, మేము మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. అయినా ఆ తర్వాత కూడా రష్మిక విజయ్ ఇంటికి వెళ్లి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం, కలిసి తిరగడంతో నెటిజన్లు, సోషల్ మీడియా మాత్రం వీరు డేటింగ్ లోనే ఉన్నారు అని అనుకుంటున్నారు. ఇటీవల రష్మిక పుట్టిన రోజు జరిగింది.

రష్మిక పుట్టిన రోజు నాడు తనకు వచ్చిన విషెష్ కి అభిమానులకు, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే విజయ్ దేవరకొండ పాత ఫోటో ఒకటి షేర్ చేసి, దాంట్లో ఉన్న ప్లేస్, రష్మిక ఇప్పుడు వీడియో పోస్ట్ చేసిన ప్లేస్ రెండూ ఒకటే, ఇద్దరూ ఒకే చోట ఉన్నారా? నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారా, డేటింగ్ చేస్తున్నారా అని సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ చేశారు. రష్మిక వీడియో, విజయ్ ఫోటో చూస్తుంటే నిజంగానే అది ఒకే ప్లేస్ లా అనిపిస్తుంది అందరికి.

Shahrukh Khan : KKR Vs RCB మ్యాచ్ కి కూతురితో కలిసి వచ్చిన షారుఖ్.. KKR గెలవడంతో డ్యాన్స్ వేసి రచ్చ రచ్చ

అయితే ఓ నెటిజన్ ఇలా పోస్ట్ చేసి రష్మికని కూడా ట్యాగ్ చేయడంతో రష్మిక దీనికి రిప్లై ఇస్తూ.. అయ్యో, మరీ ఓవర్ గా థింక్ చేయకు బాబు అని పోస్ట్ చేసింది. దీంతో రష్మిక చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మరి ఈ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చిందా, ఇవ్వలేదా? వీరి డేట్ లో ఉన్నారని చెప్తుందా? లేక ఉన్నా ఆలోచించొద్దు అంటుందా అని మరోసారి అభిమానులు, నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. ఒకవేళ ఇద్దరి మధ్య ఏమి లేకపోతే ఒకేసారి క్లారిటీ ఇవ్వొచ్చు కదా అని నెటిజనుల అడుగుతుంటే, అభిమానులు మాత్రం మీ పెయిర్ బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది నెటిజన్లు మాత్రం వీళ్లిద్దరి మధ్య ఏమి లేదు, ఎక్కువ ఆలోచించకండి అని కామెంట్ చేసింది రష్మిక అంటున్నారు.