Rashmika Pooja
Rashmika : ప్రస్తుతం సౌత్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే, రష్మిక. సౌత్ లో వరుస సినిమాలు, వరుస విజయాలతో పాటు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేస్తున్నారు. ఏ స్టార్ హీరో సినిమా అయినా వీళ్ళే హీరోయిన్స్ గా ఉంటున్నారు. కొత్త సినిమాలొస్తే అడ్జస్ట్ చేయడానికి వీళ్ళ డేట్స్ కూడా ఖాళీ లేవు, అంత బిజీగా ఉన్నారు వీరిద్దరూ.
ప్రస్తుతం పూజా హెగ్డే తమిళ్ స్టార్ హీరో విజయ్ సరసన ‘బీస్ట్’ సినిమాలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 13న రిలీజ్ అవ్వనుంది. ఇక విజయ్ నెక్స్ట్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాని మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక విజయ్ ప్రస్తుత సినిమా ‘బీస్ట్’ని కూడా తెలుగులో దిల్ రాజే విడుదల చేస్తున్నారు.
Srvanthi Chokarapu : మిత్రా శర్మ నాకు 5 లక్షలు ఇస్తానంది
సినిమా రిలీజ్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ”విజయ్ 66వ సినిమాకు కూడా ముందు పూజాహెగ్డేనే హీరోయిన్ గా అనుకున్నాం. పూజాతో మాట్లాడాము కూడా కానీ పూజా డేట్స్ ఖాళీ లేవు, అంతే కాకుండా పూజా ప్రస్తుతం ‘బీస్ట్’లో విజయ్ సరసన నటించింది. మళ్ళీ వెంటనే అంటే రిపీట్ అవుతుందని తర్వాత వద్దనుకున్నాం. ఆ తర్వాత రష్మికని అప్రోచ్ అయ్యాం. తను ఓకే చెప్పింది” అని తెలిపారు. ఇలా పూజాహెగ్డే కాదనడంతో రష్మికకి విజయ్ సరసన ఈ సినిమా ఛాన్స్ వచ్చింది. మొత్తానికి ఎవరికి వచ్చినా స్టార్ హీరోల సినిమాలు అన్ని వీళ్లు ఇద్దరే పంచుకుంటున్నారు.