Rashmika Mandanna
Rashmika : టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న(Rashmika Mandanna) ఒకరు. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ ఇండస్ట్రీల్లో తనదైన ముద్రను వేసింది. ప్రస్తుతం అమ్మడి దృష్టంతా బాలీవుడ్‌పైనే ఉంది. అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె ఎంతగానో నమ్మిన వ్యక్తే ఆమెను మోసం చేశారు అన్నదే ఆ వార్త సారాంశం.
రష్మిక సినీ కెరీర్ ఆరంభం నుంచి ఆమె వెన్నంటే ఉంటూ ఎంతో నమ్మకంగా పని చేసిన మేనేజర్ ఆమెను మోసం చేశాడట. దాదాపు రూ.80లక్షల వరకు ఆమెకు తెలియకుండా దొంగిలించాడట. అయితే.. చేసిన తప్పు ఎన్నో రోజులు దాగదుగా ఈ విషయం రష్మిక కు తెలిసింది. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. కాగా..ఈ విషయాన్ని పెద్దది చేయడం ఇష్టంలేని ఆమె ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని తెలుస్తోంది.
1996 ఏప్రిల్ 5న జన్మించింది రష్మిక మందన్న. ‘కిరాక్ పార్టీ’ చిత్రంతో కన్నడలో అరంగ్రేటం చేసింది. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ చిన్నది చాలా తక్కువ సమయంలోనే మహేశ్ బాబు, అల్లు అర్జున్, నితిన్ వంటి స్టార్స్‌తో నటించి టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులతో అప్పుడప్పుడు చిట్‌చాట్‌లు చేస్తుంటుంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారింది. అందులో శ్రీవల్లి క్యారెక్టర్‌లో జీవించేసి అబ్బాయిల మనసులను కొల్లగొట్టేసింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2’లోనూ ఆమె నటిస్తోంది. ఆ చిత్రమే కాకుండా సందీప్‌రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ‘యానిమల్’ సినిమాలోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై రష్మిక ఎన్నో ఆశలను పెట్టుకుంది.
Honey Rose : అక్కడ ముద్దు పెట్టేందుకు చాలా పెద్ద రిస్క్ చేసిన హానీ రోజ్