Rashmika Mandanna : మొన్న విజయ్.. ఇప్పుడు రష్మిక క్లారిటీ.. పెళ్లిపై రష్మిక సమాధానం.. పడీ పడీ నవ్విన శ్రీలీల..

రష్మిక మాట్లాడిన తర్వాత యాంకర్ రష్మికను మీరు ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? బయటి వ్యక్తిని చేసుకుంటారా అని అడగ్గా..

Rashmika Mandanna and Vijay Deverakonda Gives Clarity Indirectly about Their Relationship

Rashmika Mandanna : విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఔటింగ్స్, వెకేషన్స్ కు వెళ్లగా పలుమార్లు ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. రీసెంట్ గానే ఇద్దరూ కలిసి బయట ఓ రెస్టారెంట్ లో తింటున్న ఫోటో ఒకటి వైరల్ అయింది. ఇటీవల విజయ్ దేవరకొండ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరు సింగిలా, కమిటెడ్ అని అడిగితే నాకు 35 ఏళ్ళు వచ్చాయి ఇంకా సింగిల్ గా ఉంటానా అని చెప్పడంతో మరోసారి విజయ్ – రష్మిక రిలేషన్ షిప్ వైరల్ అయింది.

నిన్న చెన్నైలో పుష్ప 2 ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ కు పుష్ప 2 టీమ్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో రష్మిక మాట్లాడిన తర్వాత యాంకర్ రష్మికను మీరు ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? బయటి వ్యక్తిని చేసుకుంటారా అని అడగ్గా రష్మిక.. ఆ విషయం అందరికి తెలుసు కదా అని చెప్పింది. దీంతో అందరూ ఒక్కసారిగా అరిచారు. ఇక రష్మిక చెప్పిన సమాధానికి ఈవెంట్ కి వచ్చిన శ్రీలీల పడీ పడీ నవ్వింది. అల్లు అర్జున్ కూడా రష్మిక సమాధానానికి నవ్వాడు.

Also Read : Allu Arjun : నా 20 ఏళ్ళ జీవితం చెన్నైలోనే.. అల్లు అర్జున్ తమిళ్ లో స్పీచ్ అదరగొట్టాడుగా..

యాంకర్ అందరికి తెలుసు కానీ నాకు తెలీదు ఎవరో కొంచెం క్లూ ఇస్తారా అని అడగ్గా.. నీకు పర్సనల్ గా చెప్తాలే అని సమాధానమిచ్చింది రష్మిక. మొన్న విజయ్ నేను సింగిల్ కాదు అని చెప్పడం, ఇప్పుడు రష్మిక ఎవర్ని పెళ్లి చేసుకుంటానో అందరికి తెలుసు అని చెప్పడంతో వీరిద్దరి గురించే రూమర్లు వస్తున్నాయి కాబట్టి ఇండైరెక్ట్ గా వీరిద్దరి ప్రేమపై క్లారిటీ ఇచ్చేశారా అని ఫ్యాన్స్, నెటిజన్లు అనుకుంటున్నారు. రష్మిక రెగ్యులర్ గా ప్రతి పండగను విజయ్ దేవరకొండ ఇంట్లో జరుపుకొని ఫొటోలు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ తమ ప్రేమ గురించి అధికారికంగా ఎపుడు చెప్తారో అని అంతా ఎదురుచూస్తున్నారు.