Allu Arjun : నా 20 ఏళ్ళ జీవితం చెన్నైలోనే.. అల్లు అర్జున్ తమిళ్ లో స్పీచ్ అదరగొట్టాడుగా..
చెన్నై పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో అల్లు అర్జున్ తమిళ్ లో మాట్లాడి తమిళ ప్రేక్షకులను మెప్పించాడు.

Allu Arjun Tamil Speech in Chennai Puhpa 2 Wild Fire Event
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండగా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఇటీవల పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా చేస్తే తాజాగా చెన్నైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ చేసారు. నిన్న చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు. అయితే ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ తమిళ్ లోనే మాట్లాడటం గమనార్హం.
అల్లు అర్జున్ చిన్నప్పుడు సినీ పరిశ్రమలో చెన్నైలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడు మన హీరోలు, సినీ ప్రముఖులు అంతా అక్కడే ఉన్నారు. అందుకే ఆల్మోస్ట్ మన స్టార్స్ కు తమిళ్ వచ్చు. దీంతో చెన్నై పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో అల్లు అర్జున్ తమిళ్ లో మాట్లాడి తమిళ ప్రేక్షకులను మెప్పించాడు.
Also Read : Sreeleela : పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయడంపై శ్రీలీల ఏమందంటే.. చెన్నై ఈవెంట్ లో తమిళ్ లో శ్రీలీల స్పీచ్..
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన వాళ్లకు, తమిళ ప్రజలందరికీ నా నమస్కారాలు. జీవితంలో నేను ఈ రోజు మర్చిపోలేను. సుమారు 20 ఏళ్లుగా నేను సినిమాలు చేస్తున్నాను. ప్రత్యేకంగా పుష్పకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ రావడంతో దేశం అంతా తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా చెన్నైకి వచ్చినప్పుడు వచ్చే ఫీల్ వేరు. చెన్నైతో నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. నా జీవితంలో మొదటి 20 ఏళ్ల జీవితాన్ని చెన్నైలోనే గడిపాను. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. నా జీవితంలో అంత వైల్డ్ గా ఎప్పుడూ పని చేసి ఉండను. నేను ఇష్టపడి చెన్నైలో ఈ ఫంక్షన్ పెట్టాలని అనుకున్నాను. ఇప్పుడు కచ్చితంగా తమిళ్ లోనే మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను ఈ మట్టికి ఇచ్చే గౌరవం అది. నేను దుబాయ్ కి వెళ్ళినప్పుడు అరబిక్ లో మాట్లాడాలి, కేరళ వెళ్ళినప్పుడు మలయాళంలో మాట్లాడాలి, హిందీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడాలి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడాలి అనుకుంటాను. అది నేను ఆ నేలకి ఇచ్చే గౌరవంగా భావిస్తాను. మైత్రి మూవీస్ వాళ్ళు తప్ప ఈ సినిమాను ఇంక ఎవరూ చేయలేరు. నా చిన్ననాటి స్నేహితుడు దేవిశ్రీ ప్రసాద్ నాకు ఎన్నో సినిమాలలో ఎంతో మంచి హిట్స్ ఇచ్చాడు. గత నాలుగేళ్లుగా నాతో ఈ సినిమా కోసం పని చేస్తూ నన్ను సపోర్ట్ చేసినందుకు రష్మికకు థాంక్స్. స్పెషల్ గెస్ట్ సాంగ్ చేసిన శ్రీలీల చాలా కష్టపడే మనిషి. ఈ సినిమాలో డాన్స్ చాలా బాగా చేసింది. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు. తమిళనాడులో ఈ సినిమాను మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు సుకుమార్ లేకపోతే పుష్ప సినిమా లేదు. తనతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఒక్కసారి ఆర్య సినిమా చేసిన తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. నా ఫ్యాన్స్ ని ఆర్మీ అని పిలుచుకుంటాను. మీరంటే నాకు పిచ్చి. మిమ్మల్నిఇకపై ఇంతగా వెయిట్ చేయించను. ఇకనుండి ఎక్కువ సినిమాలు చేస్తాను. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని కోరుకుంటున్నాను. చిన్నపాటి తప్పులు ఉన్నా కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను భాషను గౌరవించే వ్యక్తిని. నన్ను మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏంటో నాకు తెలుసు అని అన్నారు. దీంతో బన్నీ ఇంత బాగా తమిళ్ లో మాట్లాడటంతో ఈ స్పీచ్ వైరల్ గా మారింది.