Sreeleela : పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయడంపై శ్రీలీల ఏమందంటే.. చెన్నై ఈవెంట్ లో తమిళ్ లో శ్రీలీల స్పీచ్..

చెన్నై ఈవెంట్లో శ్రీలీల తమిళ్ లో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Sreeleela : పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయడంపై శ్రీలీల ఏమందంటే.. చెన్నై ఈవెంట్ లో తమిళ్ లో శ్రీలీల స్పీచ్..

Sreeleela Speech in Pushpa 2 Chennai Wild Fire Event Speak about Her Special Song

Updated On : November 25, 2024 / 8:34 AM IST

Sreeleela : పుష్ప 2 సినిమా లో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కిసిక్.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ను నిన్న చెన్నై లో జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ గా మారింది. ఇప్పటికే శ్రీలీల తన సోషల్ మీడియాలో పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టింది. శ్రీలీల నిన్న చెన్నై ఈవెంట్లో కూడా పాల్గొంది.

అయితే చెన్నై ఈవెంట్లో శ్రీలీల తమిళ్ లో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో తమిళ్ కూడా అంతే స్పష్టంగా మాట్లాడింది. తమిళ్, ఇంగ్లీష్ లో శ్రీలీల వైల్డ్ ఫైర్ ఈవెంట్లో మాట్లాడి మెప్పించింది.

Also See : Pushpa 2 Song Launch Event : చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్.. ఫొటోలు చూశారా?

చెన్నై ఈవెంట్లో శ్రీలీల మాట్లాడుతూ… మమ్మల్ని ఇంత ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చెన్నైలో నేను చేసిన పాట లాంచ్ చేయడానికి వచ్చి, నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నాకు మాటలు రావడం లేదు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. బన్నీ గారికి స్పెషల్ థాంక్స్. మీతో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీతో డాన్స్ చేయడం ఎలా అని అనుకున్నాను కానీ మీరు చాలా సింపుల్ గా ఉండటం, సెట్ లో ఫన్ చేయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. మీరు ఒక వైబ్ లాంటి వాళ్ళు. మీ నుండి నేను చాలా నేర్చుకున్నాను. రష్మిక గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. సెట్స్ లో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఇప్పుడు మేము చాలా క్లోజ్ అయ్యాము. దేవిశ్రీ ప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి అవకాశం ఇచ్చిన దర్శకుడు సుకుమార్ గారికి చాలా థాంక్స్ అని అన్నారు. శ్రీలీల క్యూట్ గా తమిళ్ లో మాట్లాడటంతో ఈ స్పీచ్ వైరల్ గా మారింది.