Rashmika Mandanna : రణబీర్‌ని చెంప మీద కొట్టి ఏడ్చేశాను.. ఇలా లైఫ్‌లో మళ్ళీ రాదేమో..

తాజాగా రష్మిక మందన్న ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా సినిమాలో రష్మిక రణబీర్ ని చెంప మీద కొట్టే సన్నివేశం గురించి మాట్లాడింది.

Rashmika Mandanna : రణబీర్‌ని చెంప మీద కొట్టి ఏడ్చేశాను.. ఇలా లైఫ్‌లో మళ్ళీ రాదేమో..

Rashmika Mandanna Crying after slaps Ranbir Kapoor in Animal Movie

Updated On : January 20, 2024 / 8:46 AM IST

Rashmika Mandanna : రణబీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న రిలీజయిన యానిమల్ సినిమా దాదాపు 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా సక్సెస్ తో చిత్రయూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రణబీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది యానిమల్ సినిమా.

త్వరలోనే యానిమల్(Animal) సినిమా ఓటీటీకి రానుంది. సినిమా రిలీజయి నెలన్నర దాటేస్తున్న ఇంకా యానిమల్ సినిమా గురించి బాలీవుడ్ లో మాట్లాడుతూనే ఉన్నారు. సినిమాలో నటించిన వారు కూడా పలు ఇంటర్వ్యూలలో యానిమల్ సినిమా గురించి మాట్లాడుతున్నారు. తాజాగా రష్మిక మందన్న ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా సినిమాలో రష్మిక రణబీర్ ని చెంప మీద కొట్టే సన్నివేశం గురించి మాట్లాడింది.

Also Read : Lavanya Tripathi : వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా.. తమ లవ్ జర్నీ వీడియో షేర్ చేసిన లావణ్య..

రష్మిక మందన్న మాట్లాడుతూ.. రణబీర్ ని చెంప మీద కొట్టే సన్నివేశం ముందు సందీప్ వచ్చి ఒక భార్యలా ఫీల్ అయి నీ భర్త వేరే వాళ్ళతో గడిపి వస్తే ఎలా చేస్తావో అలా చేయి అని చెప్పాడు. ఆ సీన్ అంతా హాఫ్ డేలో ఆల్మోస్ట్ సింగిల్ షాట్ లో అయిపోయింది. రణబీర్ ని కొట్టిన తర్వాత నేను నిజంగానే ఏడ్చేశాను, గట్టిగట్టిగా అరిచేశాను. డైరెక్టర్ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు ఆ సీన్ లో. అసలు యాక్షన్ చెప్పిన తర్వాత కట్ చెప్పేదాకా అక్కడ ఏం జరుగుతుందో నాకే తెలీదు. తర్వాత గుర్తులేదు కూడా. ఇలాంటి సీన్స్ ఒక యాక్టర్ కి రావడం అదృష్టం. ఈ రేంజ్ సీన్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయని కూడా చెప్పలేం. ఈ సీన్ నాకు యానిమల్ సినిమాతో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. సీన్ అయ్యాక కూడా కాసేపు ఏడ్చేశాను. ఆ తర్వాత రణబీర్ దగ్గరికి వెళ్లి అంతా ఓకేనా? దెబ్బ గట్టిగా తగిలిందా అని అడిగాను. అతను అంతా ఓకే నో ప్రాబ్లమ్ అని చెప్పాడు అని తెలిపింది.