×
Ad

Rashmika Mandanna: ‘నాకు తెలుసు మీరంతా..’ ఎంగేజ్ మెంట్ తరువాత రష్మిక తొలి పోస్ట్.. క్లారిటీ ఇచ్చేసింది!

టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఎంగేజ్ మెంట్(Rashmika Mandanna) చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లితో ఒకటి కాబోతున్నారు.

Rashmika Mandanna First post on social media after engagement

Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. దీనికి సంబంధించి అక్టోబర్ 3 శుక్రవారం రోజున కేవలం కుటుంబసభ్యుల మధ్య అతి గోప్యంగా వీరి నిశ్చితార్ధం జరిగింది. అయితే, దీనికి సంబంధించి ఈ ఇద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగని, ఈ వార్తలను ఖండిస్తూ కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. (Rashmika Mandanna)దీంతో, ఈ వార్తలు నిజమేనని ఫిక్స్ అవుతున్నారు. ఇక ఈ జంట పెళ్లి 2026లో జరుగనుందని సమాచారం.

Mirai OTT: మిరాయ్ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. డేట్ ఇదే.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

పెళ్లిళ్లకు దివ్యంగా చెప్పుకునే మాఘమాసంలో వీరి పెళ్లి జరిపించాలని కుటుంబసభ్యులు ఫిక్స్ అయ్యారట. ఇదిలా ఉంటే, ఎంగేజ్ మెంట్ వార్తల తరువాత మొదటిసారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది రష్మిక మందన్నా. సారీలో సంప్రదాయబద్ధంగా ఉన్న ఫోటోను షేర్ చేసి “నాకు తెలుసు మీరంతా దీని కోసమే ఎదురు చూస్తున్నారు” అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అయితే ఇది తన నెక్స్ట్ సినిమా “ది గర్ల్ ఫ్రెండ్” రిలీజ్ డేట్ గురించి. దీంతో ఎంతో ఆశగా చూసిన తన ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అయితే, కొంతమంది మాత్రం రెండు వార్తలు కలిసేలా హింట్ ఇస్తూ రష్మిక ఆ పోస్ట్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ “రౌడీ జనార్ధన” అనే మాస్ సినిమా చేస్తున్నాడు. దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక రష్మిక నెక్స్ట్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్”. ‘ఛీలాసౌ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.