Mirai OTT: మిరాయ్ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. డేట్ ఇదే.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మిరాయ్(Mirai OTT). దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించాడు.

Mirai OTT: మిరాయ్ ఓటీటీలోకి వచ్చేస్తుంది.. డేట్ ఇదే.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..

Mirai movie to be streamed on Jio Plus Hotstar from October 10

Updated On : October 4, 2025 / 11:37 AM IST

Mirai OTT: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మిరాయ్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించాడు. యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఇండియన్ మైథలాజి లింకప్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆ హైప్ ను మ్యాచ్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా (Mirai OTT)నిలిచింది. సినిమాలో కంటెంట్, గ్రాఫిక్స్, వీఎసెక్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ కి మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్ లో డిజైన్ చేశారు మేకర్స్.

Rashmika Mandanna: రష్మిక బ్రేకప్ స్టోరీ.. మరోసారి సోషల్ మీడియాలో వైరల్.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. మొదటిరోజే ఏకంగా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అది కేసుల ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండా. నార్మల్ టికెట్ రేట్స్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మాములు విషయం కాదనే చెప్పాలి. ఇక సినిమా విడుదలై దాదాపు నాలుగు వారలు గడుస్తున్నా నేపధ్యంలో మిరాయ్ ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జియో ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 10 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు.

నిజానికి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఓటీటీ రిలీజ్ డేట్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే ఓటీటీలో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి మీరు మిరాయ్ సినిమాను థియేటర్స్ లో మిస్ అయ్యారా.. అయితే అక్టోబర్ 10 నుంచి జియో ప్లస్ హాట్ స్టార్ లో చూసేయండి.

Mirai Ott release date