Rashmika Mandanna: రష్మిక బ్రేకప్ స్టోరీ.. మరోసారి సోషల్ మీడియాలో వైరల్.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లవ్ స్టోరీ అండ్ బ్రేకప్ స్టోరీ ఇప్పుడు(Rashmika Mandanna) మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దానికి కారణం తాజాగా ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకోవడమే.

Rashmika Mandanna breaks off engagement with Kannada star Rakshit Shetty
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లవ్ స్టోరీ అండ్ బ్రేకప్ స్టోరీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దానికి కారణం తాజాగా ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకోవడమే. అక్టోబర్ 3 శుక్రవారం స్టార్ హీరో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న నిశ్చితార్ధం చాలా గోప్యంగా జరిగింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. గత కొంత కాలంగా ఈ ఇద్దరి మధ్య ఎదో ఉందంటూ(Rashmika Mandanna) వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలకు చెక్ పెడుతూ ఉంగరాలు మార్చుకున్నారు ఈ జంట. త్వరలోనే వీరి పెళ్లిపై అధికారిక ప్రకటన రానుంది.
Vijay-Rashmika Marriage: మాఘమాసంలోనే ముహూర్తం.. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి డేట్ ఇదే!
ఇదిలా ఉంటే, రష్మిక-విజయ్ ఎంగేజ్ మెంట్ నేపధ్యంలో మరోసారి రష్మిక మందన్న బ్రేకప్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనే రష్మికకు కన్నడ స్టార్ రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ జంట తమ ఎంగేజ్ మెంట్ ను బ్రేకప్ చేసుకున్నారు. ఈ ఇద్దరు కలిసి కన్నడలో “కిరిక్ పార్టీ” అనే సినిమా చేశారు. 2016లో విడుదలైన ఈ సినిమాను కాంతార హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించాడు. ఈ సినిమా సమయంలోనే రష్మిక, రక్షిత్ శెట్టి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2017లో ఇరు కుటుంబాలను ఒప్పించి ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.
ఇక పెళ్లే ఆలస్యం అనుకున్న సమయంలో అనుకోని కారణాల వల్ల ఈ జంట విడిపోయింది. ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇక్కడ వరుసగా అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా ‘చలో’. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో “గీత గోవిందం” సినిమాలో అవకాశం వచ్చింది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమా సమయంలోనే విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న మధ్య పరిచయం, ప్రేమ మొదలయ్యాయి. ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. ఇక అప్పటినుంచి వీరు రిలేషన్లో ఉంటూ వస్తున్నారు. అడపాదడపా ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపించినా సింపుల్ గా కొట్టిపారేస్తూ వచ్చారు. కానీ, ఫైనల్ గా ఏడేళ్ల రిలేషన్ తరువాత పెళ్లితో ఒకటి కాబోతున్నారు రష్మిక, విజయ్.