Vijay-Rashmika Marriage: మాఘమాసంలోనే ముహూర్తం.. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి డేట్ ఇదే!
టాలీవుడ్ స్టార్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు(Vijay-Rashmika Marriage). చాలా కాలంగా వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ త్వరలోనే ఈ ఇద్దరు ఒక్కటి కాబోతున్నారు.

Vijay Deverakonda and Rashmika Mandanna to get married in February
Vijay-Rashmika Marriage: టాలీవుడ్ స్టార్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. చాలా కాలంగా వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ త్వరలోనే ఈ ఇద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఈమేరకు అక్టోబర్ 3 శుక్రవారం ఉదయం విజయ్ దేవరకొండ(Vijay-Rashmika Marriage) ఇంట్లో చాలా సీక్రెట్ గా వీరి నిశ్చితార్ధం జరిగింది. ఇరు కుటుంబాలకు సంబదించిన అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా ఈ వేడుక జరిగింది.
అయితే, ఎంగేజ్ మెంట్ తంతు ముగియడంతో పెళ్లి ఎప్పుడు ఉంటుంది అనేది విషయం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 2026 జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వీరి పెళ్లి జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది మాఘమాసం. మాఘమాసం అనేది వివాహాలు శ్రేష్టమైనది చెప్తారు. అందుకే వచ్చే మాఘమాసంలోనే వీరి పెళ్లి చేయాలనీ నిశ్చయించారట కుటుంబసభ్యులు. ఇక తేదీల పరంగా చూసుకుంటే.. ఫిబ్రవరి 3, 6, 9,12,19, 26 వ తేదీలలో వివాహాలకు అద్భుతమైన ముహుర్తాలు ఉన్నాయి. కాబట్టి, ఈ తేదీలలోనే వీరి వివాహం జరుగనుందని తెలుస్తోంది. అది కూడా హిందూ సంప్రదాయం ప్రకారమే ఈ జంట వివాహం చేసుకోబోతున్నారట.
ఈ మధ్య చాలా మంది సెలబ్రెటీలు చేసుకుంటున్నట్టుగా డెస్టినేషన్ వేడింగ్ లా కాకుండా.. పూర్తి సంప్రదాయబద్దంగా ఈ పెళ్లి వేడుక జరుగనుందని సమాచారం. అలాగే, వివాహానంతరం హైదరాబాద్ లోనే గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారట. ఈ వేడుకకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు హాజరవుతారని టాక్. ఇక విజయ్ దేవరకొండ-రష్మీక మందన్నా గీత గోవిందం సినిమాలో మొదటిసారి కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమకు దారి తీసింది. కానీ, తాము జస్ట్ ఫ్రెండ్ అంటూ కలరింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. పలు వేడుకలకు కలిసి వెళ్లడం, ఒకరి సినిమాకు ఒకరు విషెస్ చెప్పుకోవడం కూడా చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూస్తే అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అనిపించేది. ఇప్పుడు అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇస్తూ ఎంగేజ్ మెంట్ రింగ్ లు మార్చేసుకున్నారు.