Rashmika Mandanna In Sanjay Leela Bhansali Next Movie
Rashmika Mandanna: స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ‘పుష్ప’ మూవీలో శ్రీవల్లి పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకుంది. ఈ బ్యూటీకి ఏకంగా నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా వచ్చింది. ఇక పుష్ప అందుకున్న సక్సెస్‌తో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ఇటీవల బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది రష్మిక. బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్ బై’ అనే సినిమాలో నటించింది.
Rashmika Mandanna : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక..
అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అంతగా సక్సెస్ కాలేదు. దీంతో తాను అనుకున్న స్థాయిలో బాలీవుడ్ ఎంట్రీని ఇవ్వలేకపోయానని రష్మిక ఫీల్ అవుతోందట. ఇక తన నెక్ట్స్ మూవీ ‘మిషన్ మజ్ను’ నేరుగా ఓటీటీలో వస్తుండటంతో ఇప్పుడు ఆలోచనలో పడిందట రష్మిక. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో రష్మిక చర్చలు జరుపుతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Rashmika Mandanna : కన్నడ పరిశ్రమలో తనపై నిషేధం గురించి రష్మిక కామెంట్స్..
తాజాగా సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్‌లో రష్మిక ఆయనతో భేటీ అయ్యిందట. అయితే ఆమె భన్సాలీతో చేసిన చర్చ గురించి మాత్రం ఎలాంటి విషయాలను వెల్లడించలేదు. దీంతో భన్సాలీ తన నెక్ట్స్ మూవీలో రష్మికకు ఆఫర్ ఇచ్చేందుకే ఆమెను తన ఆఫీసుకు పిలిచి ఉంటాడని బీ-టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ఇదేగనక నిజమైతే, రష్మికకు అదిరిపోయే ఆఫర్ రావడం ఖాయమని అభిమానులు అంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తన సినిమాల్లో హీరోయిన్లను ఎలివేట్ చేసే విధానం ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. మరి నిజంగానే భన్సాలీ తన నెక్ట్స్ మూవీలో రష్మికకు ఆఫర్ ఇస్తున్నాడా.. లేక క్యాజువల్‌గానే వారిద్దరు కలుసుకున్నారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.