Rashmika Mandanna in Septimius Awards Best Asian Actress Nominations List
Septimius Awards : ఇటీవల మన సినిమాలు, మన నటీనటులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రపంచంలోని పలు ఇంటర్నేషనల్ అవార్డులు(International Awards) కూడా గెలుచుకుంటున్నారు. తాజాగా నెదర్లాండ్స్ కి చెందిన సెప్టిమిస్ అవార్డ్స్ నామినేషన్స్ లో మన నటీనటులు కూడా నిలిచారు. నెదర్లాండ్స్ కి చెందిన ఈ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమలకు సంబంధించి కొన్ని విభాగాల్లో బెస్ట్ అవార్డ్స్ ఇస్తారు.
ఈ సారి బెస్ట్ ఆసియన్ యాక్ట్రెస్ నామినేషన్స్ లో ఇండియా నుంచి మన రష్మిక మందన్నతో పాటు నమితా లాల్ అనే బాలీవుడ్ నటి కూడా నిలిచింది. ఇక బెస్ట్ ఆసియన్ యాక్టర్ నామినేషన్స్ లో మలయాళం హీరో టోవినో థామస్ నిలిచాడు. అలాగే బాలీవుడ్ కమెడియన్ భువన్ భమ్ కూడా నిలిచాడు. బెస్ట్ ఆసియన్ ఫిలిమ్స్ లో ఇటీవల మలయాళం నుంచి వచ్చి దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించిన 2018 సినిమా నిలిచింది.
దీంతో వీరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ అవార్డుని గెలుస్తారో లేదో చూడాలి. ఈ అవార్డ్స్ వేడుక సెప్టెంబర్ 26న జరగనుంది.
What a lovely surprise this is. ?? thankyou.. this is all because of you my loves. ? eternally grateful ? https://t.co/RjJRn8acVW
— Rashmika Mandanna (@iamRashmika) September 5, 2023