Rashmika Mandanna : కోట్లు కోట్లు బొగ్గుకే ఖర్చు పెట్టెయ్యండి..

‘పుష్ప’ లంచ్ బ్రేక్‌లో రష్మిక ఎంత పని చేసింది?..

Rashmika Mandanna : కోట్లు కోట్లు బొగ్గుకే ఖర్చు పెట్టెయ్యండి..

Rashmika Mandanna

Updated On : November 14, 2021 / 7:55 PM IST

Rashmika Mandanna: ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత స్పీడ్‌గా ఉందో.. ముఖ్యంగా ఏదైనా ఓ బర్నింగ్ ఇష్యూ కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన వార్తల్లో కానీ మీమ్స్ అనేవి ఏ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కన్నడ చిన్నది రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Pushpa The Rise : ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటున్న అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. స్టోరీ బ్యాక్‌ డ్రాప్‌ని బట్టి హీరో, హీరోయిన్లతో సహా లీడింగ్ ఆర్టిస్టులంతా డీ గ్లామర్‌గానే కనిపించబోతున్నారు.

Pushpa The Rise : బన్నీ రంగంలోకి దిగితే కానీ.. డిస్ట్రిబ్యూటర్ మాట వినలేదు..

అయితే రీసెంట్‌గా రష్మిక.. ‘పుష్ప లంచ్ బ్రేక్స్ బి లైక్’ అంటూ అరచేయి వరకు ఒరిజినల్‌గా మిగతా చేయి అంతా బ్లాక్ మేకప్‌తో ఉన్న పిక్ షేర్ చేసింది. దీంతో ఈ మూవీలో మేకప్ కోసం బొగ్గు ఎక్కువగా వాడుతున్నారంటూ.. పుష్ప ప్రొడ్యూసర్స్ ‘కోట్లు కోట్లు బొగ్గుకే ఖర్చు పెట్టెయ్యండి’ అని సీరియస్ అవుతున్నట్లు ‘మాస్టర్’ మూవీలో విజయ్ సేతుపతి పిక్ పెట్టి క్రియేట్ చేసిన మీమ్ విపరీతంగా వైరల్ అవుతోంది.

NBK 107 : ఫుల్ కాన్ఫిడెన్స్.. సాయి మాధవ్ బుర్రా ట్వీట్ చూశారా!