×
Ad

Rashmika Mandanna: స్త్రీశక్తి ఒక అద్భుతం.. ఏకమైతే ఎవరు ఆపలేరు.. అందరు అలా ఉండాలి..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం "ది గర్ల్ ఫ్రెండ్" మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. స్త్రీకి సామాజిక స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

Rashmika Mandanna interesting post about female empowerment

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. స్త్రీకి సామాజిక స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాపై చాలా మంది ప్రశంసలు కురిపించారు. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ మూవీ. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్నా(Rashmika Mandanna) నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. భూమా పాత్రలో ఆమె నటించలేదు. జీవించింది అనే చెప్పాలి. ఈ సినిమాకు ఆమె అవార్డ్స్ అందుకోవడం కూడా ఖాయం అంటూ పలువురు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Keerthy Suresh: కీర్తి సురేష్ లైఫ్ లో కొత్త ప్రయాణం.. త్వరలోనే అధికారిక ప్రకటన..

ఇదిలా ఉంటే, ఓపక్క సినిమాలు చేస్తూనే వీలున్నప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గానే ఉంటుంది రష్మిక. తాజాగా ఈ అమ్మడు స్త్రీ శక్తి గురించి పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “స్త్రీశక్తి అనేది ఒక అద్భుతం. దాని గురించి ఎలా వివరించాలో కూడా అర్థం కావడంలేదు. మహిళలు ఒకరికొకరు సపోర్ట్ గా ఉండాలి. ఒకరి సమస్యలు మరొకరికి చెప్పుకున్నప్పుడు వారి జీవితాలు మారతాయి. మాములుగా కూడా స్త్రీలు ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటారు. సమస్యలు తెలుసుకొని ధైర్యాన్నిస్తారు, నేనున్నాను అనే భరోసా కలిపిస్తారు.

ఇది తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. నా ఫ్రెండ్స్‌ ఎప్పుడూ నాకు అండగా ఉంటారు. అమ్మాయిలు అంటే బలహీనమైనవారు అసలే కాదు. వారు చాలా బలవంతులు. కాబట్టి, మీ అందరి జీవితాల్లోనూ గొప్ప స్నేహితురాళ్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను” అంటూ పోస్టులో రాసుకొచ్చింది రష్మిక. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె మైరా అనే పాన్ ఇండియా సినిమా చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు తో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మొదటిసారి అడవిబిడ్డగా, వీరమహిళగా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.