Keerthy Suresh: కీర్తి సురేష్ లైఫ్ లో కొత్త ప్రయాణం.. త్వరలోనే అధికారిక ప్రకటన..

స్టార్ బ్యూటీ కీర్తి సురేష్(Keerthy Suresh) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ మధ్యే వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఓపక్క సినిమాలు మరోపక్క పర్సనల్ లైఫ్ ను పర్ఫెక్ట్ గ బాలన్స్ చేస్తోంది.

Keerthy Suresh: కీర్తి సురేష్ లైఫ్ లో కొత్త ప్రయాణం.. త్వరలోనే అధికారిక ప్రకటన..

Star beauty Keerthy Suresh to start a new journey as a director

Updated On : November 22, 2025 / 12:20 PM IST

Keerthy Suresh: స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy Suresh)ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ మధ్యే వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఓపక్క సినిమాలు మరోపక్క పర్సనల్ లైఫ్ ను పర్ఫెక్ట్ గ బాలన్స్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా “రివాల్వర్ రీటా”. దర్శకుడు కె చంద్రు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాధికా, అజయ్ ఘోష్ లాంటివాళ్ళు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో ఆసక్తిని పెంచిన ఈ కామెడీ థ్రిల్లర్ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలోనే ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్.

The Great Pre Wedding Show OTT: ఓటీటీలోకి వస్తున్న ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..?

ఇందులో భాగంగానే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన సినిమా అండ్ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే తన జీవితంలో కొత్త ప్రయాణం మొదలుకాబోతుంది అంటూ కూడా చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్రయాణం మీరేదో కాదు ఆమె త్వరలోనే మెగాఫోన్ పట్టనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఒక కథను సిద్ధం చేస్తున్నారట. ఆ కథను ఆమెనే తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు కీర్తి సురేష్. దీంతో కీర్తి చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు గురించి కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇక ఈ ఇంటర్వ్యూలో కీర్తి తన భర్త గురించి మాట్లాడుతూ.. “నా భర్త సినిమాల గురించి పట్టించుకోరు. ఆయన నాతో నటించే అవకాశం కూడా లేదు. ఇక ఈ మధ్య పెరిగిన సైబర్ నేరాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది. విదేశాల్లో ఉన్నట్టుగా కఠిన చట్టాలు మన దేశంలో కూడా రావాలి’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అమ్మడు చేస్తున్న తెలుగు సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే ఆమె విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న రౌడీ జనార్ధన సినిమా సెట్స్ లో అడుగుపెట్టింది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.