×
Ad

Rashmika Mandanna: ఎంగేజ్మెంట్ తరువాత మొదటిసారి.. మీడియా ముందుకు రష్మిక.. నోరు విప్పుతుందా..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ ఎంగేజ్ మెంట్ కొన్ని రోజుల కిందట (Rashmika Mandanna)జరిగిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఈ ఇద్దరు సడన్ గా నిశ్చితార్ధం చేసుకొని ఆడియన్స్ కి షాక్కిచ్చారు.

Rashmika Mandanna makes her first media appearance after her engagement to Vijay Deverakonda

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ ఎంగేజ్ మెంట్ కొన్ని రోజుల కిందట జరిగిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఈ ఇద్దరు సడన్ గా నిశ్చితార్ధం చేసుకొని ఆడియన్స్ కి షాక్కిచ్చారు. త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు ఈ జంట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 2026 ఫిబ్రవరిలో వీరి పెళ్లి ఘనంగా జరుగనుందని టాక్. అయితే, ఈ ఎంగేజ్మెంట్ గురించి విజయ్, రష్మిక(Rashmika Mandanna) ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగని, ఆ వార్తలను ఖండిస్తూ కూడా ఎవరు స్పందించలేదు. దీంతో, వీరి ఎంగేజ్మెంట్ జరగడం నిజమేనని నమ్మేస్తున్నారు.

Vivek Oberoi: సందీప్ కి సినిమా అంటే పిచ్చి.. ఓ మై గాడ్ ఏం చెప్పాలి అతని గురించి.. స్పిరిట్ ఎలా ఉంటుందంటే..

ఇదిలా ఉంటే, ఎంగేజ్మెంట్ తరువాత మొదటిసారి మీడియా ముందుకు రానుంది రష్మిక మందన్నా. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీ రోల్ చేస్తుండగా నవంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపధ్యంలోనే అక్టోబర్ 25న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. విడుదల అనంతరం టీం మీడియా మీట్ కూడా ఉంటుంది. ఈ మీట్ లో రష్మిక కూడా తప్పకుండా పాల్గొంటుంది. కాబట్టి, ఎగజ్మెంట్ గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి, ఈరోజు జరుగబోయే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ పై ఆసక్తి నెలకొంది. మరి రష్మిక ఈ ప్రశ్నలను ఎదుర్కొంటుందా? వాటికి ఎలాంటి సమాధానం చెప్తుందా అనేది చూడాలి. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే థామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో కొకటైల్ 2 సినిమాలో నటిస్తోంది. అలాగే, అల్లు అర్జున్ తో పుష్ప 3లో కూడా కనిపించనుంది.