Vivek Oberoi: సందీప్ కి సినిమా అంటే పిచ్చి.. ఓ మై గాడ్ ఏం చెప్పాలి అతని గురించి.. స్పిరిట్ ఎలా ఉంటుందంటే..

సందీప్ రెడ్డి వంగా.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ దర్శకుడి (Vivek Oberoi)గురించే చర్చ. తీసినవి మూడు సినిమాలే. అందులో ఒకటి రీమేక్. కానీ, అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నెక్స్ట్ లెవల్.

Vivek Oberoi: సందీప్ కి సినిమా అంటే పిచ్చి.. ఓ మై గాడ్ ఏం చెప్పాలి అతని గురించి.. స్పిరిట్ ఎలా ఉంటుందంటే..

Bollywood hero Vivek Oberoi praises Sandeep Reddy Vanga

Updated On : October 25, 2025 / 9:30 AM IST

Vivek Oberoi: సందీప్ రెడ్డి వంగా.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ దర్శకుడి గురించే చర్చ. తీసినవి మూడు సినిమాలే. అందులో ఒకటి రీమేక్. కానీ, అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నెక్స్ట్ లెవల్. సినిమా అంటే ఇలానే తీయాలి, ఇంత డ్యూరేషనే ఉండాలి అనే బ్యారికేడ్స్ తొలగించేశారు సందీప్. ఆయన కథలు, వాటిని ప్రెజెంట్ చేసే విధానం అంతా కొత్తగా ఉంటుంది. అందుకే ఆయన అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు. అంతెందుకు.. (Vivek Oberoi)సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం సందీప్ రెడ్డి వర్క్ కి ఫ్యాన్ అయిపోయాడు అంటూ మనోడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు.

Sharwanand: ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ఏంటి ఇలా అయిపోయాడు.. కేవలం ఒక సినిమా కోసమేనా..

తాజాగా సందీప్ రెడ్డి వంగా ఫ్యాన్స్ లిస్టులో మరో బాలీవుడ్ స్టార్ చేరిపోయాడు. ఆ స్టార్ మరెవరో కాదు వివేక్ ఒబెరాయ్. రీసెంట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగాపై ప్రశంసలు కురిపించాడు ఈ నటుడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “సందీప్ రెడ్డి వంగా మ్యాడ్ గాయ్. అతనికి సినిమా అంటే పిచ్చి. అసలు అంత నాలెడ్జ్, అంత క్లారిటీ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. నాకు ఒక అలవాటూ ఉంది. ఎవరి సినిమా అయినా, ఎవరి వర్క్ అయినా నచ్చితే వెంటనే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతాను. అలా ఒకసారి హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు సందీప్ రెడ్డికి కాల్ చేసి తన వర్క్ గురించి మాట్లాడాను. దానికి తాను సార్ మీరంటే నాకు చాలా ఇష్టం ఒకసారి కలవొచ్చా అని అడిగాడు. ఆరోజు కాఫీకి కలిసి మాట్లాడుకున్నాం.

ఆ చర్చ కొన్ని గంటల పాటు అలానే సాగింది. అప్పడు అర్థమయ్యింది. సందీప్ రెడ్డి వంగా మాములు వ్యక్తి కాదు అని. అసలు సినిమాపై అతనికి ఉన్నది ఇష్టం కాదు పిచ్చి అనిపించింది”అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే, ఇప్పుడు చేయబోతున్న స్పిరిట్ కూడా అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. దీంతో, సందీప్ రెడ్డి వంగా గురించి వివేక్ ఒబెరాయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సందీప్ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ కీ రోల్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.