Sharwanand: ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ఏంటి ఇలా అయిపోయాడు.. కేవలం ఒక సినిమా కోసమేనా..
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే మనుగడ ఉంటుంది. అందుకే, ఆ సక్సెస్ కోసం స్టార్స్ ఏదైనా(Sharwanand) చేయడానికి సిద్ధపడతారు. యాక్షన్ సీన్స్, రిస్కీ షాట్స్ ఇలా చాలానే సాహసాలు చేసి ఆడియన్స్ ను మెప్పించాలని చూస్తూ ఉంటారు.
Sharwanand completely transformed for the movie Biker
Sharwanand: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే మనుగడ ఉంటుంది. అందుకే, ఆ సక్సెస్ కోసం స్టార్స్ ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. యాక్షన్ సీన్స్, రిస్కీ షాట్స్ ఇలా చాలానే సాహసాలు చేసి ఆడియన్స్ ను మెప్పించాలని చూస్తూ ఉంటారు. కొంతమంది సినిమా కోసం తమ బాడీని కూడా మార్చేసుకుంటారు. ఎంతలా అంటే కనీసం గుర్తుపట్టలేనంతగా. ఇప్పుడు అలాగే మారిపోయాడు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand). తాజాగా ఆయన తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోలు చూసి చాలా మంది అవాక్కయ్యారు. అసలు చాలా సేపటివరకు గుర్తుపట్టాలకపోయారు కూడా. అంతలా తన బాడీని ట్రాన్స్ఫారమ్ చేసుకున్నాడు ఈ హీరో.
Maruthi: ఈ క్యాంపులోనే ఉండిపో.. మారుతీకి మరో సినిమాకి అడ్వాన్స్.. అయితే ఈసారి ఆలా కాదు..
అది కూడా కేవలం ఒక సినిమా కోసం. శర్వానంద్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్. కొత్త దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాడు. బైక్ రేసింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో నిజమైన బైకర్ గా కనిపించాలని బాడీని పూర్తిగా మార్చేసుకున్నాడు శర్వానంద్. సన్నగా, బక్కచిక్కిపోయి, మొహం కూడా చాలా లోపలికి వెళ్లి వింతగా తయారయ్యాడు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఆడియన్స్, నెటిజన్స్, ముఖ్యంగా శర్వానంద్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఒక సినిమా కోసం ఇంతలా కష్టపడాలా. ఈ నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక బైకర్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా షూటింగ్ చాలా కాలం కృతేమ మొదలయ్యింది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై చూడాలి బైక్ రేసింగ్ విజువల్స్ తో ఈ సినిమా రానుందట. ఆ విషయంలో ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని పంచనుందట. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది బైకర్ మూవీ. ఇక ఈ సినిమా తరువాత, భోగి, నారి నారి నడుమ మురారి, సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. ఆలాగే, కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్లతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వానంద్.
