Maruthi: ఈ క్యాంపులోనే ఉండిపో.. మారుతీకి మరో సినిమాకి అడ్వాన్స్.. అయితే ఈసారి ఆలా కాదు..

డైరెక్టర్ మారుతి.. ఈరోజుల్లో అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా (Maruthi)ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Maruthi: ఈ క్యాంపులోనే ఉండిపో.. మారుతీకి మరో సినిమాకి అడ్వాన్స్.. అయితే ఈసారి ఆలా కాదు..

Director Maruthi to make another film with Prabhas

Updated On : October 25, 2025 / 7:01 AM IST

Maruthi: డైరెక్టర్ మారుతి.. ఈరోజుల్లో అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా చేయాలంటే భారీ ఖర్చు అవసరం లేదు చిన్న 4D కెమరాతో కూడా చేయొచ్చు అనే నిరూపించింది ఈ సినిమా. నిజానికి, ఈ సినిమా తరువాతే చాలా మంది యువత సొంతగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తరువాత మారుతి(Maruthi) చేసిన సినిమా ప్రేమ కథా చిత్రం. హారర్ అండ్ కామెడీ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి నెట్ ఫ్లిక్స్ ట్రిబ్యూట్.. ఇండియాలో నంబర్ వన్ హీరో.. ఇది కదా అతని రేంజ్..

ఇక అక్కడి నుంచి వరుసగా క్రేజీ సినిమాకు చేస్తూ వస్తున్నాడు మారుతి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయాడు. నానితో చేసిన భలే భలే మొగాడివోయ్ సినిమా ఆయన్ని స్టార్ డైరెక్టర్ ని చేసింది. ఈ దర్శకుడు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హారర్ అండ్ కామెడీ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి, ప్రభాస్ మారుతి లాంటి డైరెక్టర్ తో సినిమా చేయడం అనేది ఎవరు ఊహించలేదు. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్టుపై నెగిటీవ్ కామెంట్స్ చేశారు.

కానీ, సినిమా నుంచి అదిరిపోయే కంటెంట్ దించుతూ భారీ హైప్ క్రియేట్ చేశాడు మారుతి. దెబ్బకి తనపై వస్తున్న ట్రోలింగ్ మొత్తం ఆగిపోయింది. అంతలా తన వర్క్ తో మెప్పించాడు మారుతి. ఆయన స్టైల్ అఫ్ మేకింగ్ ప్రభాస్ కి కూడా ఒక రేంజ్ లో నచ్చిందట. దాంతో, తనతో మరో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడట ప్రభాస్. రాజాసాబ్ విడుదల అయిన వెంటనే ఈ కొత్త ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని అని టాక్ నడుస్తోంది. అంతేకాదు, మారుతి వర్క్ నచ్చడంతో తన కాంపౌండ్ లో ఉండాలంటూ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడట ప్రభాస్. దీంతో, మారుతి ఫుల్ హ్యాపీ గా ఫీలయ్యాడట. ప్రభాస్ లాంటి ఒక స్టార్ మారుతి లాంటి దర్శకుడికి ఈ రేంజ్ ఆఫర్ ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. అందుకే, ఈసారి ప్రభాస్ కోసం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సబ్జెక్టును ప్రిపేర్ చేయబోతున్నాడట.