Rashmika Mandanna makes shocking comments on trolling
Rashmika Mandanna: “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. విడుదల రోజు కాస్త డివైడ్ టాక్ వచ్చింది ఈ సినిమాకు. కానీ, దర్శకుడు (Rashmika Mandanna)రాహుల్ రవీంద్రన్ సినిమాలో చూపించిన కంటెంట్ చాలా ఎమోషనల్ గా ఉండటంతో చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. చాలా మంది ఈ సినిమాపై ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. దీంతో తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు టీం.
Pawan Kalyan: డిజాస్టర్ డైరెక్టర్.. ఒకేసారి రెండు కథలు.. పవన్ కళ్యాణ్ ఎలా డీల్ చేస్తాడో..
అయితే, ఓపక్క ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ లో ఉంటే మరోపక్క రష్మిక మందన్నాపై సోషల్ మీడియాలో తీవ్రమైన నెగిటీవ్ ట్రోలింగ్ నడుస్తోంది. దానికి కారణం ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మగవాళ్లపై ఆమె చేసిన కామెంట్స్. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ “మగవాళ్ళకి కూడా పీరియడ్స్ వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది” అంటూ చెప్పింది. ఆ వీడియో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్స్ రశ్మికను సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో ఆదుకున్నారు. “మగవాళ్ళకి ఉండే బాధలు వాళ్ళకి ఉంటాయి. ఇంటి మొత్తాన్ని కష్టపడి పోషించాలి. ఆ బాధను ఎవరు భరించాలి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ కామెంట్స్ పై మరోసారి స్పందించింది రష్మిక. “అందుకే నేను ఎక్కువగా ఇంటర్వ్యూలకు రాను. ఏదో ఒకటి అడుగుతారు చెప్పిన సమాధాదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు. మగవారికి పీరియడ్స్ రావాలని నేను చెప్పిన ఉద్దేశం వేరు. అర్థం అయ్యింది వేరే. నేను చేసిన కామెంట్స్ ను తప్పుగా స్ప్రెడ్ చేశారు. ఇవి చూసినప్పుడే ఇంటర్వ్యూలకు రావాలంటే భయమేస్తోంది” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి.