భన్సాలీ సినిమాకి నో చెప్పేసిన రష్మిక

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 06:57 AM IST
భన్సాలీ సినిమాకి నో చెప్పేసిన రష్మిక

Updated On : May 1, 2019 / 6:57 AM IST

బాలివుడ్ ఫిల్మ్ మేకర్స్ కి సౌత్ యాక్టర్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. బాలివుడ్ గా బాప్ హై ఏ టాలివుడ్ అంటున్నారు తెలుగు హీరో, హీరోయిన్స్. అవకాశాలిస్తాం రండి అంటూ రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నా తెలుగు స్టార్స్ బాలివుడ్ ని తీసి పక్కనపెట్టేస్తున్నారు. మొహం మీదే నో చెప్పేస్తున్నారు. లేటెస్ట్ గా రౌడీ హీరోయిన్ రష్మిక మండన్నా స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఆఫర్ ని తీసి పక్కనపెట్టేసింది. బాలివుడ్ కదా అని వెనకా ముందు ఆలోచించకుండా వెళ్లే టైప్ తాను కాదని రష్మిక నిరూపించింది. భన్సాలీ సినిమాలో రష్మిక పాత్రకి పెద్ద గా ఇంపార్టెన్స్ లేకపోవడంతో మొహమాటం లేకుండా నో చెప్పేసింది.

గతంలో తెలుగు స్టార్ హీరోలు కూడా బాలివుడ్ కి నో చెప్పేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుని ఒక్క సినిమా చేయమని హిందీ ఫిల్మ్ మేకర్స్ ఎప్పటినుంచో అడుగుతున్నారు. మహేశ్ మాత్రం ప్రతిసారి నో అనేస్తున్నాడు. తెలుగు సినిమాలే హిందీలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. సో బాలివుడ్ కి వెళ్లడం పెద్ద టైం వేస్ట్ అన్నాడు ప్రిన్స్. ఈ మధ్య ప్రభాస్ ని కూడా బాలివుడ్ కి పరిచయం చేసేందుకు ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ చాలా ట్రై చేశాడు. కానీ బాహుబలి కావాలంటే డబ్బింగ్ సినిమాలు కొని రిలీజ్ చేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. 

అంతేకాదు టాలివుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా బాలివుడ్ ఆఫర్ ని తిరస్కరించాడు. క్రికెటర్ కపిల్ దేవ్ లైఫ్ స్టోరీతో రాబోతున్న 83 మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం డైరెక్టర్ కబీర్ ఖాన్ విజయ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ సపోర్టింగ్ రోల్స్ చేయాల్సిన అవసరం తనకిలేదని నో చెప్పేశాడు. ఇలా బాలివుడ్ ఫిల్మ్ మేకర్స్ కి తెలుగు స్టార్స్ అంత ఈజీగా అవకాశం ఇవ్వడం లేదు.