Rashmika Mandanna : పాపకి డిమాండ్ పెరిగింది..!
కన్నడ, తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే మరో తమిళ్ మూవీ చెయ్యడానికి రెడీ అయ్యింది కన్నడ భామ రష్మిక..
Rashmika Mandanna: టాలీవుడ్లో ఆల్ రెడీ పాగా వేసిన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తోంది. కన్నడ, తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే మరో తమిళ్ మూవీ చెయ్యడానికి రెడీ అయ్యింది కన్నడ భామ రష్మిక. సౌత్‌లో ఇప్పటికే బిజీగా ఉన్న ఈ భామ కమిట్ అయ్యిన నెక్ట్స్ సినిమా ఏంటి..?
వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ.. తెలుగులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందన్న.. స్టార్ హీరోలతో వరుసగా ఆఫర్లు కొట్టేస్తూ.. హీరోలకు ఓన్లీ ఆప్షన్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. సౌత్‌లో వరుసగా హిట్లు కొడుతూ మంచి జోష్‌లో ఉన్న రష్మిక.. అటు బాలీవుడ్లో బిజీగా ఉంటూనే సౌత్‌ని కూడా బ్యాలెన్స్ చేస్తోంది. లేటెస్ట్గా మరో తమిళ్ సినిమా కమిట్ అయ్యింది రష్మిక.
South Stars : డెబ్యూతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు..
రష్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌తో ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్లో లేటెస్ట్గా ‘సుల్తాన్’ సినిమా చేసిన రష్మిక.. అది అంతగా ఆకట్టుకోకపోవడంతో తమిళ్లో మరో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యింది. ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్‌తో శివ కార్తికేయన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్టు, ఈ సినిమాలో హీరోయిన్గా రష్మికని ఫిక్స్ చేసినట్టు టాక్ నడుస్తోంది.
బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ టైటిల్‌తో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కోవర్టు ఆపరేషన్స్ బ్యాక్ డ్రాప్లోతెరకెక్కుతున్న సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా సరసన హీరోయిన్గా నటిస్తోంది రష్మిక. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‌తో ‘గుడ్ బై’ సినిమాని కూడా కంప్లీట్ చేసే పనిలో ఉంది. బాలీవుడ్ సినిమాలు కొలిక్కి రావడంతో మళ్లీ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇలా ఇటు టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్‌తో పాటు ఇక బాలీవుడ్లో కూడా అవకాశాలు అందుకుంటూ రేసులో ముందుంటోంది ఈ ముద్దుగుమ్మ.