Kcr: సిట్ నోటీసులు.. విచారణకు హాజరవుతారా? లేదా? కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ
వారిద్దరితో చర్చించిన తర్వాత సిట్ విచారణ అంశంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. విచారణకు సమయం కోరే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Kcr Representative Image (Image Credit To Original Source)
- ఫోన్ ట్యాపింగ్ విచారణ నోటీసులపై తర్జనభర్జన
- విచారణకు సమయం కోరే అంశాన్ని పరిశీలిస్తున్న కేసీఆర్?
- మున్సిపల్ ఎన్నికల తర్వాతే సిట్ విచారణకు హాజరు..!
Kcr: ఫోన్ ట్యాపింగ్ విచారణ నోటీసులపై బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. వారిద్దరితో చర్చించిన తర్వాత సిట్ విచారణ అంశంపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. విచారణకు సమయం కోరే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు హాజరవుతానని సమయం కోరే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్న టాక్.
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఇచ్చిన నోటీసుల్లో సిట్ బృందం పేర్కొంది. ఒకవేళ కేసీఆర్ వస్తే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తామన్నారు. వయసు రిత్యా అక్కడికి రావాలని లేకపోతే హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో ఎక్కడైనా సరే కేసీఆర్ కోరుకున్న చోట విచారిస్తామని చాలా స్పష్టంగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, విచారణకు హాజరుపై కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఫిబ్రవరి 11 మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ కు చాలా కీలకం. ఇటువంటి సమయంలో కేసీఆర్ సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ భేటీ తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: నేరస్తులకు శిక్ష పడాల్సిందే- కేసీఆర్కు సిట్ నోటీసులపై కవిత సంచలన వ్యాఖ్యలు
