Kavitha: నేరస్తులకు శిక్ష పడాల్సిందే- కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కవిత సంచలన వ్యాఖ్యలు
సిట్ విచారణ నాన్ సీరియస్ గా జరుగుతోందని మండిపడ్డారు. విచారణ ఎక్కడో దగ్గర పూర్తి కావాలని అభిప్రాయపడ్డారు.
Kavitha Representative Image (Image Credit To Original Source)
- మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని కేసీఆర్ కు సిట్ నోటీసులు
- సిట్ విచారణ నాన్ సీరియస్ గా జరుగుతోంది
- ఫోన్ ట్యాపింగ్ బాధాకరం
Kavitha: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. కేసీఆర్ ను విచారిస్తామని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. మాజీ ముఖ్యమంత్రికి సిట్ నోటీసుల అంశంపై కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే.. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని కవిత ఆరోపించారు. సిట్ విచారణ నాన్ సీరియస్ గా జరుగుతోందని మండిపడ్డారు. విచారణ ఎక్కడో దగ్గర పూర్తి కావాలని అభిప్రాయపడ్డారు.
విచారణను పూర్తి చేసే ఉద్దేశం ఉందా లేదా అనేది ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధాకరమన్న కవిత.. నేరస్తులకు శిక్ష పడాల్సిందే అని తేల్చి చెప్పారు.
Also Read: రాజకీయ పార్టీ ఏర్పాటుపై కవిత కసరత్తు స్పీడప్.. ఆ నెలలో పార్టీపై ప్రకటన? తర్వాత పాదయాత్ర..!?
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ బృందం నోటీసులిచ్చింది.
నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు.. నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చిన సిట్ అధికారులు వయసు రీత్యా కేసీఆర్ పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదని తెలిపారు. కేసీఆర్ కోరిన చోటే విచారిస్తామన్నారు. తొలుత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తారని భావించినప్పటికీ.. హైదరాబాద్ పరిధిలోనే కేసీఆర్‌ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిట్ చీఫ్ హోదాలో ఉన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ కేసీఆర్ ను విచారించే అవకాశం ఉంది.
