Rashmika Mandanna The Girlfriend movie trailer released
The Girlfriend Trailer: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. చిలాసౌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్ కీ రోల్స్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగానే తాజాగా “ది గర్ల్ ఫ్రెండ్” ట్రైలర్(The Girlfriend Trailer) విడుదల చేశారు మేకర్స్. “మనం చిన్న బ్రేక్ తీసుకుందామా.. ” అంటూ రష్మిక చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. మిగతా అంతా చాలా ఎమోషనల్ కంటెంట్ తో సాగింది. రష్మిక నటన చాలా కొత్తగా ఉంది. యూత్ ఫుల్ కంటెంట్ ఉంటూనే ఎమోషనల్ పాయింట్ ని ఈ సినిమాలో చెప్పబోతున్నారు అని అర్థమవుతోంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.