Allu Arjun: సినిమా అంటే “శివ”.. రెండు లారీల పేపర్స్ తో సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న అల్లు అర్జున్ పోస్ట్
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఒరిజినల్ (Allu Arjun)రిలీజ్ ల కంటే రీ-రిలీజ్ లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్ కూడా. అంతేకాదు, ఈ రీ-రిలీజ్ లో కూడా పలు రికార్డులను నమోదు చేస్తున్నారు.
Allu Arjun crazy post about Nagarjuna Shiva cinema re release
Allu Arjun: ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఒరిజినల్ రిలీజ్ ల కంటే రీ-రిలీజ్ లపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్ కూడా. అంతేకాదు, ఈ రీ-రిలీజ్ లో కూడా పలు రికార్డులను నమోదు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా(Allu Arjun) స్టార్ హీరోల సినిమాల మధ్య ఈ పోటీ ఎక్కువగా నడుస్తోంది. సీనియర్ హీరోలు సైతం వారి బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి పలు సినిమాలను రీ రిలీజ్ చేయగా ఇప్పుడు అక్కినేని నాగార్జున సైతం తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన శివ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 14న రీ రిలీజ్ కానుంది.
Prashanth Neel: నా దొంగ మొగుడు తెల్ల బట్టలు వేశాడు.. స్టార్ డైరెక్టర్ వైఫ్ అలా అందేంటి..!
ఈనేపధ్యంలోనే శివ సినిమా రీ రిలీజ్ పై క్రేజ్ పోస్ట్ పెట్టాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. “తెలుగు ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే శివ సినిమాకు ముందు.. తర్వాత అని చెబుతారు. ఈ రీ రిలీజ్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి మీతోపాటు రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండి” అంటూ రాసుకొచ్చాడు అల్లు అర్జున్. ఇక ఈ పోస్టుకు రిప్లై ఇచ్చిన నాగార్జున.. “నీకు రెండు లారీల థాంక్స్ అంటూ రాసుకొచ్చాడు. దీంతో, అల్లు అర్జున్, నాగార్జున చేసిన ఈ రెండు పోస్ట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక నాగార్జున విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన తన వందవ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు ర కార్తీక్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది.
Dear @alluarjun rendu lorryla thanks to you !!!💥💥💥#Shiva4KOnNovember14th #50YearsOfAnnapurna #SHIVA #ANRLivesOn@RGVzoomin @amalaakkineni1 @ilaiyaraaja @AnnapurnaStdios #SGopalReddy @adityamusic pic.twitter.com/5FSZAyqpp5
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 25, 2025
