Spirit : ప్రభాస్ సరసన రష్మిక మందన్న? ‘స్పిరిట్’లో గట్టిగానే ప్లాన్ చేస్తున్న సందీప్ వంగ..

తాజాగా స్పిరిట్ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.

Spirit : ప్రభాస్ సరసన రష్మిక మందన్న? ‘స్పిరిట్’లో గట్టిగానే ప్లాన్ చేస్తున్న సందీప్ వంగ..

Rashmika Mandanna will Act in Prabhas Spirit Movie under Sandeep Reddy Vanga Direction

Updated On : February 13, 2024 / 7:48 AM IST

Prabhas – Rashmika : ఇటీవల సలార్ సినిమాతో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ ఆ తర్వాత కల్కి, రాజాసాబ్, స్పిరిట్ సినిమాలను లైన్లో పెట్టాడు. యానిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా వైడ్ పాపులర్ అయిన సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా రానుంది. త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెడతానని సందీప్ వంగ(Sandeep Reddy Vanga) చెప్పాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నట్టు సమాచారం.

తాజాగా స్పిరిట్ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన రష్మిక మందన్నని తీసుకోబోతున్నారని సినీ పరిశ్రమలో వినిపిస్తుంది. ఇటీవలే యానిమల్ సినిమాలో రష్మికని తీసుకున్న సందీప్ వంగ స్పిరిట్ లో కూడా ఒక హీరోయిన్ గా రష్మికని తీసుకోవాలని అనుకుంటున్నాడట. రష్మికతో పాటు రెండో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది.

Also Read : Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి సడెన్ సర్‌ప్రైజ్.. ఆశ్చర్యపోతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..

వరుస పాన్ ఇండియా సినిమాలతో రష్మిక దూసుకెళ్లిపోతుంది. త్వరలో పుష్ప 2తో కనపడనుంది. ప్రభాస్ సరసన రష్మిక చేస్తుందని టాక్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. స్పిరిట్ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం చివర్లో మొదలవుతుందని సమాచారం.