Bigg Boss 7 : రైతుబిడ్డ ప్రశాంత్‌కు రతిక వార్నింగ్.. చేయి వేసావంటే మర్యాదగా ఉండదు చెబుతున్నా..
బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు రియాలిటీ షో విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది.
- Thota Vamshi Kumar
- Published On : September 19, 2023 / 04:27 PM IST
Rathika warning to Prashanth
Bigg Boss 7 Day 16 promo : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 7 విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్స్‌లో శుభశ్రీ, గౌతమ్, ప్రియాంక, దామిని, రతిక, యావర్, అమర్ దీప్ లు ఉన్నారు. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. బిగ్‌బాస్ ఇంట వినాయక చవితి సంబరాలు మొదలుఅయ్యాయి. హౌస్‌లోని వారు వినాయకుడిని తయారు చేసి పూజలు చేశారు. ఆ తరువాత మూడు వారాలు ఇమ్యూనిటీ ఇచ్చే మూడో పవర్ అస్త్రా కోసం పోటీపడేందుకు ముగ్గురు కంటెస్టెంట్లను బిగ్‌బాస్ ఎంపిక చేశాడు. అమర్ దీప్, శోభా, యావర్ లు మూడో పవర్ అస్త్రా కోసం పోటీపడనున్నారు.
అయితే.. రైతు బిడ్డ ప్రశాంత్ ఒక్కడే పడుకుని ‘నేను బిగ్‌బాస్ మనసులో ఓడిపోయినా’ అంటూ బాధపడుతుంటాడు. బిగ్‌బాస్ అతడిని కన్‌సెషన్ రూమ్‌లోకి రమ్మని పిలుస్తాడు. ఆ ముగ్గురిని తప్పించి అందరిని ఒక్కొక్కరిగా లోపలికి పిలిచాడు. ఆ ముగ్గురులో మీరు కంటెడర్ షిప్ కు ఎవరు అనర్హులు అని అనుకుంటున్నారో చెప్పాలని బిగ్‌బాస్ అడుగుతాడు. శోభాశెట్టి పేరును ప్రశాంత్ చెప్పాడు. ఇలా ఒక్కొక్కరు ఎవరు అనర్హులు అనే విషయాన్ని చెబుతారు.
లివింగ్‌రూమ్‌లో అందరూ కూర్చున్న తరువాత ఆ ముగ్గురికి లభించిన కంటెడర్ షిప్‌తో కొందరు కంటెస్టెంట్లు సంతోషంగా లేరని బిగ్‌బాస్ చెబుతాడు. కొంతమంది చెప్పిన కారణాలను ఇప్పుడు చూపిస్తానని అంటాడు. ఆ తరువాత పల్లవి ప్రశాంత్, రతిక ల మధ్య ఏదో విషయంలో చిన్న గొడవ జరిగినట్లుగా అర్థం అవుతోంది. ‘చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు’ అంటూ పల్లవి ప్రశాంత్‌ను ఉద్దేశించి రతిక అనగా ‘ఏహే పో’ అంటూ ప్రశాంత్ ఆమెను చేతితో పక్కకు తోసే ప్రయత్నం చేశాడు. దీంతో రతిక కోపంతో ఊగిపోయింది. ‘చేయి వేసావంటే ఇంకోసారి మర్యాదగా ఉండదు చెబుతున్నా’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఆ తరువాత దామిని వాళ్లిద్దరి దగ్గరికి వచ్చింది. అసలు వారిద్దరూ ఏ విషయంలో గొడవ పడ్డారు అన్న విషయాలు తెలియాలంటే నేటి పూర్తి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Actress Abhinaya : లవ్, మ్యారేజ్ గురించి నటి అభినయ ఏం చెప్పిందో తెలుసా?
