Anchor Suma Kanakala: యాంకర్ సుమకు గజమాలతో సన్మానం.. గిఫ్ట్ ఏది అని అడిగిన సుమ.. అమ్మవారి అనుగ్రహం అంటూ కామెంట్స్..
Anchor Suma: ఈ ఈవెంట్ ని కూడా సుమనే హోస్ట్ చేసింది.
Anchor Suma Felicitation by Korean Kanakaraju Movie Team
Anchor Suma Kanakala: తెలుగు ప్రేక్షకులను తన యాంకరింగ్ తో ఎన్నో ఏళ్లుగా టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ లతో మెప్పిస్తూ తెలుగు వారిళ్ళల్లో ఒకరిగా మారిపోయింది యాంకర్ సుమ కనకాల. తాజాగా యాంకర్ సుమకు మూవీ టీమ్ ఘన సత్కారం చేయడం వైరల్ గా మారింది. సుమ కొన్ని వందల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని హోస్ట్ చేసింది. తాజాగా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భీమవరంలో జరిగింది.
ఈ ఈవెంట్ ని కూడా సుమనే హోస్ట్ చేసింది. అయితే ఈవెంట్ మొత్తం అయ్యాక వరుణ్ తేజ్, తమన్ కలిసి.. ఎన్నో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని సింగిల్ హ్యాండ్ తో నడిపిస్తున్న యాంకర్ సుమకు సన్మానం అని ప్రకటించి సుమకు శాలువాలతో పాటు గజమాలతో సత్కరించారు. గజమాల కూడా తీసుకురావడంతో యాంకర్ సుమ ఆశ్చర్యపోయింది. కేవలం శాలువలేనా గిఫ్ట్ ఏది అని సరదాగా అడిగింది సుమ.
Also See – Roopa Koduvayur : చీరకట్టి మల్లెపూలు పెట్టి.. వానలో వావ్ అనిపిస్తున్న తెలుగమ్మాయి..
సన్మానం అయ్యాక యాంకర్ సుమ మాట్లాడుతూ.. ఇది నాకు జీవిత సాఫల్య పురస్కారంలా అనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ టైం ఇలా గజమాలతో ప్లాన్ చేస్తే పువ్వులకు బదులు పుదీనాతో చేయించండి రేపు ఇంట్లో చట్నీకి పనికొస్తుంది. ఇది అయితే వాడిపోతుంది అని సరదాగా అన్నారు. అలాగే.. చాలా ఏళ్ళ క్రితం నాకు భీమవరంలోని మావుళ్ళమ్మ జాతరలో సత్కారం చేసారు. మళ్ళీ ఇన్నేళ్లకు భీమవరంలో ఇలా సన్మానం చేయడం అనేది అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాను అని తెలిపింది. సుమ సన్మానం వీడియోలు, సుమ కామెంట్స్ వైరల్ గా మారాయి.
సుమకి సన్మానం!
Well-deserved respect for Suma from #VarunTej #KoreanKanakaraju pic.twitter.com/eA2K0B3r4C
— M9 NEWS (@M9News_) August 4, 2026
ఇప్పటికే బాగా చెమట పట్టింది…
పైగా మూడు శాలువాలు కప్పారు… థ్యాంక్యూ!పుదీనాతో గజమాల చేయండి… చట్నీ చేసుకుంటా!#KoreanKanakaraju #Suma #KOKA #VarunTej #RitikaNayak pic.twitter.com/viorTWHwGk
— TeluguOne (@Theteluguone) August 4, 2026
