అక్టోబర్ 18న ‘ఆవిరి’

రవిబాబు నటిస్తూ.. దర్శకత్వం వహించిన హారర్, థ్రిల్లర్‌.. ‘ఆవిరి’ ఆడియన్స్‌ను భయపెట్టడానికి అక్టోబర్ 18న థియేటర్స్‌లోకి రానుంది..

  • Published By: sekhar ,Published On : October 7, 2019 / 07:52 AM IST
అక్టోబర్ 18న ‘ఆవిరి’

Updated On : May 28, 2020 / 3:56 PM IST

రవిబాబు నటిస్తూ.. దర్శకత్వం వహించిన హారర్, థ్రిల్లర్‌.. ‘ఆవిరి’ ఆడియన్స్‌ను భయపెట్టడానికి అక్టోబర్ 18న థియేటర్స్‌లోకి రానుంది..

ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు నటిస్తూ.. దర్శకత్వం వహించిన హారర్, థ్రిల్లర్‌.. ‘ఆవిరి.. ’దిల్ రాజు సమర్పణలో, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మించాడు. ‘ఈ ఇంట్లో రాజ్ కుమార్ రావు అతని ఫ్యామిలీ నివసిస్తుంది. వారితో పాటు ఒక ఆత్మ కూడా ఉంది.. దానిని మీరు కనిపెట్టగలరా’? అంటూ రిలీజ్ చేసిన ‘ఆవిరి’ టీజర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆత్మ కుర్చీలాక్కోవడం, గ్లాస్‌లో జ్యూస్ పోసుకోవడం, మనిషి కనిపించకుండా కేవలం షూస్ మాత్రమే నడవడం, బాత్‌టబ్‌లో పొగలు రావడం, అందులో నుండి సడెన్‌గా ఓ చెయ్యి బయటకి రావడం.. చూసి షాక్ అయ్యారు ప్రేక్షకులు.. ఫస్ట్‌లుక్‌తోనే ఇంప్రెస్ చేసిన రవిబాబు టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచాడు.

Read Also : ‘జైహిందే మా జీహాద్’ : ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ట్రైలర్..

నేహా చౌహాన్, శ్రీ ముఖ్తా, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రధారులు నటించిన ‘ఆవిరి’ ఆడియన్స్‌ను భయపెట్టడానికి అక్టోబర్ 18న థియేటర్స్‌లోకి రానుంది. సినిమాటోగ్రఫీ : ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, మ్యూజిక్ : వైధీ, ఫైట్స్ : సతీష్, ఆర్ట్ : నారాయణ రెడ్డి, స్క్రీన్‌ప్లే : సత్యానంద్, కథ, నిర్మాత, దర్శకత్వం : రవిబాబు.